వినాయక చవితి పండుగ భారతీయ సంస్కృతిని ఏకం చేసే పండుగగా హిమాచల్ ప్రదేశ్ నూతన గవర్నర్‌గా నియమితులైన బండారు దత్తాత్రేయ అన్నారు. విఘ్నాలను తొలగించి ప్రజలను కాపాడాలని గణపతికి పూజలు చేస్తామని తెలిపారు.
భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి వద్ద దత్తాత్రేయ పూజలు - భారతీయ సంస్కృతి
హైదరాబాద్ సిద్ధి అంబర్ బజార్‌లోని భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి కార్యాలయంలో బండారు దత్తాత్రేయ ప్రత్యేక వినాయక పూజ నిర్వహించారు. ప్రజలందరూ చల్లగా ఉండాలని గణపతిని కోరుకున్నారు.
ప్రజలందరినీ విఘ్నాలు రాకుండా వినాయకుడే కాపాడాలి : దత్తాత్రేయ
దేశ, రాష్ట్ర హితం కోసం పూజలు చేయాలని సూచించారు. సిద్ధి అంబర్ బజార్‌లోని భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి కార్యాలయంలో గణపతి పూజ సందర్భంగా దత్తాత్రేయను సమితి అధ్యక్షుడు రాఘవరెడ్డి ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో మాజీ ఎంపీ వివేక్ తదితరులు పాల్గొన్నారు.
ఇవీ చూడండి : వినాయక చవితి విశిష్టతలేమిటో...?