INTER: ఇంటర్ మొదటి సంవత్సరం ప్రవేశాలకు గడువు పెంపు - telangana varthalu
15:59 July 08
ఇంటర్ మొదటి సంవత్సరం ప్రవేశాలకు గడువు పెంపు
ఇంటర్ మొదటి సంవత్సరం ప్రవేశాలకు గడువు పెంచుతూ ఇంటర్ బోర్డు నిర్ణయం తీసుకుంది. ఈ నెల 31 వరకు ఇంటర్ మొదటి సంవత్సరంలో ప్రవేశాలకు అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇంటర్ ప్రవేశాల్లో ప్రైవేట్ కాలేజీలు నిబంధనలు పాటించాలని ఇంటర్ బోర్డు కార్యదర్శి సయ్యద్ ఉమర్ జలీల్ ఆదేశాలు జారీ చేశారు.
కొన్ని కాలేజీలు అనుమతి లేకుండా ప్రవేశాలు చేపట్టాయని ఫిర్యాదులు వచ్చాయని ఆయన పేర్కొన్నారు. నిబంధనలు పాటించని కాలేజీలపై కఠిన చర్యలు తీసుకుంటామని బోర్డు కార్యదర్శి జలీల్ హెచ్చరించారు. ఉత్తర్వులు ఇచ్చే వరకు ప్రత్యక్ష తరగతులు నిర్వహించరాదని కళాశాలలకు ఆయన సూచించారు.
ఇదీ చదవండి: Komatireddy: గాంధీభవన్‌లో కూర్చుంటే ఎన్నికల్లో గెలవలేం: కోమటి రెడ్డి