సైబర్మోసాలను అరికట్టేందుకు ప్రత్యేక కేంద్రం - anjanikumar
సైబర్ మోసాలను నిరోధించేందుకు దేశంలోనే మొదటిసారిగా హైదరాబాద్‌లో ప్రత్యేక కేంద్రం ఏర్పాటు కానుంది. ప్రముఖ ఐటీ సంస్థ వెరీజాన్ వచ్చే ఏడాదికి ఈ కేంద్రాన్ని అందుబాటులోకి తీసుకురానున్నట్లు సంస్థ ప్రతినిధులు తెలిపారు.
సైబర్‌నేరగాళ్ల ఆటకట్టించేందుకు దేశంలోనే మొదటి సారిగా తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక చర్యలకు పూనుకుంది. సైబర్ మోసాల నివారణకు ఓ ప్రత్యేక కేంద్రం ఏర్పాటు చేయనుంది. ఈ బాధ్యతలను ప్రముఖ ఐటీ సంస్థ వెరీజాన్కు అప్పగించింది. వచ్చే ఏడాదికి ఈ కేంద్రాన్ని అందుబాటులోకి తీసుకొస్తామని సంస్థ ప్రతినిధులు తెలిపారు. డేటా చౌర్యంపై అధ్యయనం చేసిన వెరీజాన్ సంస్థ ఇందుకు సంబంధించిన నివేదికలను విడుదల చేసింది. కార్యక్రమంలో హైదరాబాద్ సీపీ అంజనీకుమార్ పాల్గొన్నారు. అంతర్జాలంలో వ్యాపార లావాదేవీలు నిర్వహించేవారంతా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. సైబర్ మోసాలపై ప్రజల్లో మరింత చైతన్యం రావాల్సి ఉందని అభిప్రాయపడ్డారు.