YS Viveka Murder Case: ఏపీ మాజీ మంత్రి వివేకా హత్య కేసులో దస్తగిరి వాంగ్మూలం వివరాలు వెలుగులోకి వచ్చాయి. వాంగ్మూలం ఇచ్చాక తనను కలిసిన వారిపై దస్తగిరి... సీబీఐకి ఫిర్యాదు చేశాడు. అందుకు సంబంధించిన వివరాలను సెప్టెంబర్ 30న సీబీఐకి ఇచ్చాడు.
'తన వాంగ్మూలం నమోదు తర్వాత భరత్ యాదవ్ కలిశాడు. అవినాష్‌రెడ్డి తోట వద్దకు రావాలని భరత్ యాదవ్ అడిగాడు. నేను ఉండే ఇంటి సమీప హెలిపాడ్ వద్దకు భరత్ యాదవ్, న్యాయవాది వచ్చారు. భాస్కర్‌రెడ్డి, శంకర్‌రెడ్డి పంపించారని.. 10-20 ఎకరాల భూమి ఇస్తామన్నారని చెప్పారు. ఎంత డబ్బు కావాలో చెప్పమన్నారు. భరత్ యాదవ్ తనను తరచుగా అనుసరిస్తున్నాడు' అని దస్తగిరి తన స్టేట్మెంట్లో పేర్కొన్నాడు.
వాంగ్మూలం నమోదు...
మాజీ మంత్రి వివేకా హత్య కేసుకు సంబంధించి.. సీబీఐ దర్యాప్తు ముమ్మరం చేసింది. కేసులో (ఏ-4) నిందితుడుగా ఉన్న డ్రైవర్ దస్తగిరిని.. సీబీఐ అధికారులు సోమవారం.. కడప జిల్లా పులివెందుల కోర్టులో హాజరుపరిచారు. అప్రూవర్‌గా మారిన అతని చేత.. మెజిస్ట్రేట్ ముందు సెక్షన్ 164 కింద వాంగ్మూలం నమోదు చేయించారు. గతేడాది నవంబరు 26న అప్రూవర్‌గా మారేందుకు.. దస్తగిరికి కడప కోర్టు అనుమతివ్వగా.. ఆగస్టు 31న మెజిస్ట్రేట్ ముందు వాంగ్మూలం ఇచ్చారు.