తెలంగాణ

telangana

ETV Bharat / state

Dasoju Sravan: రేవంత్​ ఆధారాలతో మల్లారెడ్డిపై ఆరోపణలు చేస్తే.. చర్యలెందుకు తీసుకోరు? - telangana latest news

అవినీతికి పాల్పడితే సొంత కొడుకునైనా వదిలి పెట్టనన్న సీఎం కేసీఆర్‌ మంత్రి మల్లారెడ్డి విషయంలో ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్‌ ప్రశ్నించారు. తెరాస మంత్రులు, నాయకులు భూ కబ్జాలకు పాల్పడుతూ రూ.కోట్లు విలువైన భూములను మింగేస్తున్నారని ఆరోపించారు. మంత్రి మల్లారెడ్డిపై పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆధారాలతోనే ఆరోపణలు చేశారన్న ఆయన.. అక్రమాలకు పాల్పడిన ప్రతి మంత్రి, ఎంపీ, ఎమ్మెల్యేల భరతం పడతామని హెచ్చరించారు.

dasoju-sravan-kumar-interesting-comments-on-cm-kcr
dasoju-sravan-kumar-interesting-comments-on-cm-kcr

By

Published : Aug 29, 2021, 7:20 PM IST

DASOJU: 'మల్లారెడ్డి విషయంలో కేసీఆర్ ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు'

అవినీతికి పాల్పడితే సొంత కొడుకునైనా వదిలిపెట్టనన్న ముఖ్యమంత్రి కేసీఆర్‌.. కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి విషయంలో ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్‌ ప్రశ్నించారు. తెరాస మంత్రులు, నాయకులు కబ్జాకోరులుగా మారారని ఆరోపించారు. కోట్లాది రూపాయల విలువ చేసే భూములను మింగేస్తున్నారని ధ్వజమెత్తారు. మల్లారెడ్డిపై పీసీసీ అధ్యక్షుడు రేవంత్​రెడ్డి ఆధారాలతోనే ఆరోపణలు చేశారని వ్యాఖ్యానించారు.

అక్రమాలకు పాల్పడిన ప్రతి మంత్రి, ఎంపీ, ఎమ్మెల్యేల భరతం పడతామని దాసోజు హెచ్చరించారు. ఆధారాలతో మల్లారెడ్డి బాగోతంపై పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. అవసరమైతే న్యాయస్థానానికి, సీబీఐ వరకూ వెళతామన్నారు. తెరాస ప్రజాప్రతినిధులపై చర్యలు తీసుకోకుండా.. అధికారులపై ఏసీబీ దాడులు ఎందుకు చేస్తున్నారని ఈ సందర్భంగా ప్రశ్నించారు.

తెరాస మంత్రులు, నాయకులు కబ్జా కోరులుగా మారారు. కోట్ల రూపాయల విలువ చేస్తే భూములను మింగేస్తున్నారు. అవినీతికి పాల్పడితే కొడుకునైనా విడిచిపెట్టనన్న కేసీఆర్​.. మరి మల్లారెడ్డి విషయంలో ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు. మల్లారెడ్డిపై రేవంత్ ఆధారాలతో ఆరోపణలు చేశారు. అక్రమాలకు పాల్పడిన ప్రతి మంత్రి, ఎంపీ, ఎమ్మెల్యేల భరతం పడతాం.-దాసోజు శ్రవణ్, ఏఐసీసీ అధికార ప్రతినిధి

ఇదీ చూడండి: REVANTH REDDY: చంద్రబాబును అప్పుడెందుకు పొగిడినవ్.. కేటీఆర్​ ఎట్ల గెలిచిండో యాదికిలేదా?

ABOUT THE AUTHOR

...view details