లాక్డౌన్ జీవోను ఉల్లంఘిస్తున్న వారిని కొడుతున్న పోలీసులు... విచ్చలవిడిగా దోపిడీ చేస్తున్న ప్రైవేటు ఆస్పత్రులపై ఎందుకు చర్యలు తీసుకోరని ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ ప్రశ్నించారు. జీవో 248 ప్రకారం ఆక్సిజన్ పడకలకు నిర్ధారించిన ధరలను ఎక్కడా పాటించడంలేదని అన్నారు. 248 జీవో నాలుక గీసుకోవడానికి కూడా పనికి రావడం లేదని తెలిపారు. జీవో 539 ప్రకారం ఆర్టీ-పీసీఆర్ పరీక్ష రూ.500 గా నిర్ణయించగా... ఒక్కరు కూడా ఈ రేటుకి టెస్ట్ చేయడం లేదని పేర్కొన్నారు. కానీ మాస్క్ లేకపోతే వెయ్యి రూపాయిల జరిమానా అంటూ తెచ్చిన జీవో కింద రూ. 31 కోట్లు వసూలు చేసినట్లు స్వయంగా డీజీపీ చెప్పారని… ఇదెక్కడి న్యాయమని దాసోజు శ్రవణ్ కుమార్ ప్రశ్నించారు.
సామాన్యులపైనా పోలీసుల ప్రతాపం: దాసోజు శ్రవణ్
బలవంతుడికి ఒక న్యాయం, బలహీనుడికి ఒక న్యాయమా అని ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ ప్రశ్నించారు. నిబంధనల ఉల్లంఘనల పేరుతో సామాన్యులను కొడుతున్న పోలీసులు... ప్రైవేటు ఆస్పత్రులపై చర్యలెందుకు తీసుకోరని ప్రశ్నించారు.
సామాన్యులపైనా పోలీసుల ప్రతాపం: దాసోజు శ్రవణ్
ప్రైవేట్ ఆస్పత్రులపై చర్యలు తీసుకోరు కానీ.. లాక్డౌన్ ఉల్లంఘించారని సామాన్యులని కొడతారని, బండ్లు సీజ్ చేస్తారని మండిపడ్డారు. దీనికి సీఎం కేసీఆర్ సమాధానం చెప్పాలని కోరారు. మంత్రి కేటీఆర్ నేతృత్వంలో ఏర్పాటైన టాస్క్ఫోర్స్ ప్రైవేట్ దవాఖానాలపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదన్నారు. పోలీసులు మానవత్వంతో వ్యవహరించాలని... పొట్టకూటి కోసం బయటికి వచ్చిన వారిపై ప్రతాపం చూపించొద్దని విజ్ఞప్తి చేశారు.
ఇదీ చదవండి :రెండు రోజులుగా కఠినంగా లాక్డౌన్ అమలు