తెలంగాణ

telangana

ETV Bharat / state

'మంత్రులు మల్లారెడ్డి, ఎర్రబెల్లిపై చర్యలు తీసుకోవాలి' - మంత్రి మల్లారెడ్డిని మంత్రి పదవి నుంచి తొలిగించాలని ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్‌ డిమాండ్‌

అవినీతికి పాల్పడితే సొంత కుమారుడిని కూడా జైల్లో పెట్టిస్తానన్న కేసీఆర్‌కు మంత్రి మల్లారెడ్డి వ్యవహారం తెలియలేదా అని దాసోజు శ్రవణ్ ప్రశ్నించారు. మంత్రులు మల్లారెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ రావుపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

dasoju shravan
'మంత్రి మల్లారెడ్డి, ఎర్రబెల్లిపై చర్యలు తీసుకోవాలి'

By

Published : Jan 19, 2020, 7:15 PM IST

టికెట్లు అమ్ముకుంటున్న మంత్రి మల్లారెడ్డిని పదవి నుంచి తొలిగించాలని ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్‌ డిమాండ్‌ చేశారు. చిన్న చిన్న ఉద్యోగులు లంచం తీసుకుంటున్నారంటూ జైలులో పెడుతున్న ఏసీబీ... టికెట్లు అమ్ముకుంటున్న ఆయనపై సుమోటోగా కేసు ఎందుకు నమోదు చేయలేదని ప్రశ్నించారు. టికెట్ల కేటాయింపులో జరిగిన సంభాషణలను మీడియాకు వినిపించిన ఆయన... మంత్రి మల్లారెడ్డి వ్యవహారంపై పోలీసులకు, ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేస్తానిని దాసోజు స్పష్టం చేశారు.

అవినీతికి పాల్పడితే సొంత కుమారుడిని కూడా జైల్లో పెడతానన్న కేసీఆర్‌కు మంత్రి మల్లారెడ్డి వ్యవహారం తెలియలేదా అని ప్రశ్నించారు. ప్రజలు ఓట్లు ఎవరికి వేస్తున్నారో మంత్రి ఎర్రబెల్లి దయాకరరావుకు ఎలా తెలుస్తుందని ప్రశ్నించిన దాసోజు... ఓటర్లను బ్లాక్ మెయిల్ చేస్తున్నారని ఆరోపించారు. తక్షణమే మంత్రి ఎర్రబెల్లిపై చర్యలు తీసుకోవాలని ఎన్నికల సంఘాన్ని డిమాండ్‌ చేశారు.

'మంత్రి మల్లారెడ్డి, ఎర్రబెల్లిపై చర్యలు తీసుకోవాలి'

ఇవీ చూడండి: 'రాష్ట్రాలు వేరైనా... సంస్కృతి, సంప్రదాయాలు ఒకటే'

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details