ETV Bharat Telangana

తెలంగాణ

telangana

ETV Bharat / state

వెల్​నెస్ సెంటర్​ను కొవిడ్ ఆస్పత్రిగా మార్చాలి - దాసోజు శ్రవణ్ - Greater Hyderabad Congress Party President Anjani Kumar latest news

ఖైరతాబాద్ బడా గణేష్ ముందున్న వెల్​నెస్ సెంటర్ ఆస్పత్రిని ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ కుమార్, గ్రేటర్ హైదరాబాద్ కాంగ్రెస్ పార్ట్ అధ్యక్షుడు అంజనీ కుమార్​లు సందర్శించారు.

dasoju shravan visited khairathabad wellness center hospital
వెల్​నెస్ సెంటర్​ను కొవిడ్ ఆస్పత్రిగా మార్చాలి - దాసోజు
author img

By

Published : May 22, 2021, 1:05 PM IST

వరంగల్ జైలును కూల్చి వేసి ఆసుపత్రిని నిర్మిస్తామన్న సీఎం కేసీఆర్... ఉన్న భవనాలను ఉపయోగించుకోవాలని ఏఐసీసీ అధికార ప్రతినిధి డాక్టర్ దాసోజు శ్రవణ్ కుమార్ కోరారు. గ్రేటర్ హైదరాబాద్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అంజనీ కుమార్​తో కలిసి దాసోజు… ఖైరతాబాద్ బడా గణేష్ ముందున్న వెల్​నెస్ సెంటర్ ఆసుపత్రిని సందర్శించారు. 2012 సంవత్సరంలో కాంగ్రెస్ ప్రభుత్వం 10 కోట్లతో ఆసుపత్రిని నిర్మించిందని... ఇంత పెద్ద భవనాన్ని వినియోగించుకోవడంలో తెరాస ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని శ్రవణ్ విమర్శించారు.

ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆసుపత్రి చాలా అధ్వానంగా మారిందని... కనీస సౌకర్యాలు, సిబ్బంది లేకే ఆస్పత్రి వెలవెలబోతుందన్నారు. ఈ విషయంలో స్థానిక ఎమ్మెల్యే దానం నాగేందర్... రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకరావకుండా ప్రేక్షక పాత్ర పోషిస్తున్నారని మండిపడ్డారు. వారం రోజుల్లో ఈ భవనాన్ని కొవిడ్ ఆసుపత్రిగా ఏర్పాటు చేయడంతో పాటు వంద పడకల ఆస్పత్రిగా మార్చాలని దాసోజు శ్రవణ్ కుమార్ డిమాండ్ చేశారు.

ఇదీ చదవండి:అనాథలైన అక్కాచెల్లెల్లు... సాయం కోసం కన్నీళ్లతో ఎదురుచూపులు

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

author-img

...view details