Dasoju Shravan Filed Compaint Threatening Calls : టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అనుచరులపై.. హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసులకు బీఆర్ఎస్ సీనియర్ నేత దాసోజు శ్రవణ్ ఫిర్యాదు చేశారు. తనను చంపుతానని బెదిరింపు కాల్స్ చేస్తున్నారని శ్రవణ్ ఫిర్యాదులో పేర్కొన్నారు. బెదిరింపులకు పాల్పడుతున్న వారి ఫోన్ నంబర్లను పోలీసులకు అందజేశారు. ఫిర్యాదు చేసిన తర్వాత పోలీస్ స్టేషన్ నుంచి బయటకు వచ్చి మీడియాతో మాట్లాడారు.
గురువారం రేవంత్ రెడ్డి అభిమానులం అంటూ తనకు కొంత మంది వ్యక్తులు.. వివిధ నంబర్ల నుంచి కాల్స్ చేశారని దాసోజు శ్రవణ్‌కు వివరించారు. తనను తన కుటుంబ సభ్యులను చెప్పలేని విధంగా దుర్భాషలు ఆడారని పేర్కొన్నారు. అందుకే ఫోన్ చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు వెల్లడించారు. దాదాపు 10 మంది వివిధ నంబర్ల నుంచి కాల్స్ చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. మరో నయీం లాగా పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి వ్యవహరిస్తున్నారని తీవ్రస్థాయిలో మండిపడ్డారు. అభిమానుల పేరుతో ఆయన భయపెట్టాలని చూస్తున్నారని వివరించారు.
Dasoju Shravan Filed Cybercrime Complaint : రాష్ట్రంలో రేవంత్ రెడ్డి, వారి అనుచరులు దండుపాళ్యం బ్యాచ్‌లా తయారయ్యిందని దాసోజు శ్రవణ్ ధ్వజమెత్తారు. ప్రజల కోసం వార్ చేయాల్సిన వారు.. వార్ రూమ్‌లో వేరే కార్యక్రమాలు జరుగుతున్నాయని తెలిపారు. మంత్రి తలసాని మీద కూడా గతంలో ఇలానే దాడులు చేశారని గుర్తు చేశారు. అలాగే హనుమంతరావు, జగ్గారెడ్డిపై కూడా దాడులు జరిగాయని వెల్లడించారు.