తెలంగాణ

telangana

Dasharathi Award: ఆచార్య ఎల్లూరి శివారెడ్డికి దాశరథి పురస్కారం.. నేడు ప్రదానం

సాహిత్య రంగంలో విశేషంగా కృషి చేసిన వారిని తెలంగాణ ప్ర‌భుత్వం (Telangana government) గుర్తించి ప్ర‌తి ఏడాది దాశ‌ర‌థి జ‌యంతి(జులై 22) రోజున దాశరథి కృష్ణమాచార్య అవార్డు (Dasarathi Award) ప్ర‌దానం చేస్తోంది. 2021 సంవత్సరానికి గానూ డాక్టర్ ఎల్లూరి శివారెడ్డికి (eluri shiva reddy) అవార్డు ఇవ్వనున్నారు.

By

Published : Jul 21, 2021, 5:34 PM IST

Published : Jul 21, 2021, 5:34 PM IST

Updated : Jul 22, 2021, 2:57 AM IST

ఆచార్య శివారెడ్డికి దాశరథి పురస్కారం.. నేడు ప్రదానం
ఆచార్య శివారెడ్డికి దాశరథి పురస్కారం.. నేడు ప్రదానం

2021 సంవత్సరానికి దాశరథి కృష్ణమాచార్య అవార్డు ప్రముఖ సాహితీవేత్త, తెలుగు విశ్వవిద్యాలయం మాజీ ఉప కులపతి డాక్టర్ ఎల్లూరి శివారెడ్డికి (eluri shiva reddy) దక్కింది. రాష్ట్ర ప్రభుత్వం (Telangana government) నియమించిన ఎంపిక కమిటీ ఆయన పేరును ఖరారు చేసింది.

రవీంద్రభారతిలో ప్రదానం..

దాశరథి జయంతి సందర్భంగా నేడు రవీంద్రభారతిలో (ravindrabharati) జరిగే కార్యక్రమంలో సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ (minister srinivas goud)... ఎల్లూరి శివారెడ్డికి అవార్డు బహూకరిస్తారు. పురస్కారం కింద లక్షా వెయ్యి 116 వేల రూపాయలతో పాటు మెమెంటో బహూకరిస్తారు. సాహిత్య రంగంలో (Literary field) విశేషంగా కృషి చేసిన వారిని తెలంగాణ ప్ర‌భుత్వం గుర్తించి ప్ర‌తి ఏడాది దాశ‌ర‌థి జ‌యంతి(జులై 22) (Dasharathi Jayanti) రోజున ఆ అవార్డును ప్ర‌దానం చేస్తోంది. ఈ అవార్డు ప్ర‌దానం 2015 సంవ‌త్స‌రం నుంచి కొన‌సాగుతోంది.

దాశరథి కృష్ణమాచార్య ప్రస్థానం..

తెలుగు సాహిత్యంలో విశిష్ట స్థానం సంపాదించిన దాశరథి కృష్ణమాచార్య.. (Dasharathi Krishnamacharya)1925 జులై 22న వరంగల్ జిల్లా గూడూరులో జన్మించారు. 2015లో తొలి దాశరథి సాహితీ పురస్కారాన్ని కవి ఆచార్య తిరుమల శ్రీనివాసాచార్యకు ప్ర‌దానం చేశారు. 2016లో జె.బాపురెడ్డికి, 2017లో ఆచార్య ఎన్.గోపికి, 2018లో వ‌ఝ‌ల శివ‌కుమార్‌కు, 2019లో డాక్ట‌ర్ కూరెళ్ల విఠ‌లాచార్య‌కు, 2020లో డాక్ట‌ర్ తిరున‌గ‌రి రామానుజ‌య్య‌కు దాశ‌ర‌థి కృష్ణ‌మాచార్య అవార్డు వ‌రించింది. ఈసారి డాక్టర్ ఎల్లూరి శివారెడ్డికి ఇవ్వనున్నారు.

డాక్టర్ ఎల్లూరి శివరెడ్డి హర్షం..

దాశరథి కృష్ణమాచార్య అవార్డు తనకు ఇవ్వడం చాలా సంతోషంగా ఉందని తెలుగు విశ్వవిద్యాలం మాజీ ఉపకులపతి డాక్టర్ ఎల్లూరి శివరెడ్డి పేర్కొన్నారు. ఈ సందర్భంగా దాశరథితో తనకు ఉన్న అనుబంధాన్ని ఆయన గుర్తు చేసుకున్నారు. తెలంగాణ రాష్ట్రంలో దాశరథి, నారాయణరెడ్డి ఇద్దరు జంట కవులని అభివర్ణించారు. దాశరథి తనకు ఎంతో అభిమానమైన కవి అని వెల్లడించారు.

కేసీఆర్‌కు ధన్యవాదాలు..

దాశరథితో వ్యక్తిగతంగా చాలా తక్కువ పరిచయం ఉన్నప్పటికీ.. ఆయన రచనలు తనను ఎంతో ప్రభావితం చేశాయని తెలిపారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం అధ్యాపకుడిగా, ఆచార్యుడిగా, తెలుగు విశ్వవిద్యాలయం ఉపకులపతిగానూ.. ఇప్పుడు తెలంగాణ సారస్వతి పరిషత్‌కు అధ్యక్షుడు ఉన్ననప్పటికీ... ఈ అవార్డు తెలంగాణ సారస్వతి పరిషత్‌ ఇచ్చినట్లు భావిస్తానని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ (CM KCR) సాహిత్యంపై ఉన్న అభిమానంతో తనకు ఈ అవార్డు ఇవ్వడంపై ధన్యవాదాలు తెలిపారు.


దాశరథి కృష్ణమాచార్య అవార్డుకు ఎంపికైనందుకు చాలా సంతోషంగా ఉంది. దాశరథి, నారాయణరెడ్డి ఇద్దరు జంట కవులు. దాశరథి రచనలు నన్ను ఎంతో ప్రభావితం చేశాయి. నాకు ఈ అవార్డు ఇస్తున్నందుకు కేసీఆర్ గారికి ధన్యవాదాలు.

-డాక్టర్ ఎల్లూరి శివారెడ్డి, తెలుగు విశ్వవిద్యాలయం మాజీ ఉపకులపతి

ఇవీ చూడండి..

Last Updated : Jul 22, 2021, 2:57 AM IST

ABOUT THE AUTHOR

...view details