తెలంగాణ

telangana

Dasharathi Award: 'దాశరథి కృష్ణమాచార్య రచనలు ఎంతో మందికి స్ఫూర్తి'

రాష్ట్ర ప్రభుత్వం... దాశరథి 97వ జయంతి వేడుకలను రవీంద్రభారతిలో ఘనంగా నిర్వహించింది. మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ చేతుల మీదుగా దాశరథి అవార్డును ఎల్లూరి శివరెడ్డి అందుకున్నారు. దాశరథి తెలంగాణ మాండలికానికి నిలువెత్తు నిదర్శమని ఎల్లూరి శివారెడ్డి కొనియాడారు.

By

Published : Jul 22, 2021, 7:42 PM IST

Published : Jul 22, 2021, 7:42 PM IST

minister
minister

హైదరాబాద్‌ రవీంద్రభారతిలో దాశరథి 97వ జయంతి వేడుకలను రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా నిర్వహించింది. ఈ సందర్భంగా తెలుగు విశ్వవిద్యాలయం మాజీ ఉపకులపతి ఎల్లూరి శివరెడ్డిని దాశరథి-2021 అవార్డుతో సత్కరించింది. ఈ కార్యక్రమంలో సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌, ప్రభుత్వం సలహాదారుడు కేవీ రమణాచారి, సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ, తెలంగాణ సంగీత నాటక అకాడమి ఛైర్మన్‌ శివకుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

'దాశరథి కృష్ణమాచార్య రచనలు ఎంతో మందికి స్ఫూర్తి'

ఉద్యమమే జీవితంగా కలిగిన రథసారథి దాశరథి కృష్ణమాచార్య అని వక్తలు అభిప్రాయపడ్డారు. నాటికి, నేటికి తెలంగాణ నాదం, నినాదమైన ప్రతిధ్వనిస్తుందన్నారు. దాశరథి ఒక వ్యక్తి కాదు... సామూహిక శక్తి అని అభివర్ణించారు.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత తెలంగాణ వైతాళికులు, కవులను, కళాకారులను గౌరవించుకుంటూ... సత్కరించుకుంటున్నామని మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ''నా తెలంగాణ కోటి ఎకరాల మాగాణి'' అనే నినాదానికి దాశరథి రచించిన 'నా తెలంగాణ కోటి రతనాల వీణ'నే స్ఫూర్తి అని పేర్కొన్నారు. అనాటి నుంచి తెలంగాణ నిరంకుశ పాలనకు దాశరథి జీవితమే నిదర్శనమని చెప్పారు. ఎంతో మంది మహానీయుల త్యాగఫలితమే తెలంగాణ ఏర్పడిందని వివరించారు.

సాహితీ చైతన్య స్ఫూర్తి దాశరథి అని ప్రభుత్వం సలహాదారుడు కేవీ రమణాచారి అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ పదబంధమే తెలంగాణ నిఘంటవుకు మాండలికమని దాశరథి అవార్డు గ్రహీత ఎల్లూరి శివారెడ్డి అన్నారు. దాశరథి రచనల నుంచి ఎంతో స్ఫూర్తి పొందినట్లు ఆయన చెప్పారు. తన సాహితీ, రచనల ద్వారా ఎంతో మందికి స్ఫూర్తి ప్రదాతగా నిలిచిన దాశరథి అవార్డు అందుకోవడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు.

దాశరథి కృష్ణమాచార్య... తెలంగాణ మాండలికానికి నిలువెత్తు నిదర్శనం. దాశరథి కృష్ణమాచార్య రచనలు ఎంతో మందికి స్ఫూర్తి. తన సాహితీ, రచనల ద్వారా ఎంతో మందికి స్ఫూర్తి ప్రదాతగా నిలిచిన దాశరథి అవార్డు అందుకోవడం చాలా సంతోషంగా ఉంది. ముఖ్యమంత్రి కేసీఆర్‌ పదబంధమే తెలంగాణ నిఘంటవుకు మాండలికం.

డాక్టర్ ఎల్లూరి శివరెడ్డి, తెలుగు విశ్వవిద్యాలయం మాజీ ఉపకులపతి

ఇవీ చూడండి..

ABOUT THE AUTHOR

...view details