ఏపీ ప్రకాశం జిల్లా సంతమాగులూరు గ్రామానికి చెందిన ఓ మహిళ ప్రియుడితో కలిసి భర్తను కడతేర్చినట్లు పోలీసులు పేర్కొన్నారు. వివరాల్లోకి వెళ్తే.. గ్రామానికి చెందిన సైదాలక్ష్మి కూలీ పనులు చేస్తుంది. ఈ క్రమంలో గుంటూరు జిల్లా నరసరావుపేట మండలం జొన్నలగడ్డ గ్రామానికి చెందిన నల్లగంగుల వెంకటరెడ్డి(ఆటో డ్రైవర్)తో పరిచయం ఏర్పడింది. అది కాస్తా వివాహేతర సంబంధానికి దారితీసింది. విషయం తెలుసుకున్న భర్త శ్రీనివాసరావు.. వెంకటరెడ్డిని మందలించాడు. ఈ విషయమై వెంకటరెడ్డి, సైదాలక్ష్మి ఇద్దరు కలిసి శ్రీనివాసరావును అడ్డు తొలగించుకోవాలనుకున్నారు.
పథకం ప్రకారం..
ఈ నెల 25 రాత్రి మద్యం మత్తులో ఉన్న శ్రీనివాసరావు.. భార్యతో గొడవ పడి పడుకున్నాడు. పథకం ప్రకారం అర్థరాత్రి సమయంలో సైదా లక్ష్మి, ప్రియుడితో కలసి.. భర్త గొంతు నులిమి చంపేసింది. అనంతరం దానిని ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేసింది.