తెలంగాణ

telangana

ETV Bharat / state

కరోనా పంజా: బల్కంపేట ఎల్లమ్మ ఆలయంలో దర్శనాలు బంద్ - హైదరాబాద్​ తాజా వార్తలు

కరోనా నేపథ్యంలో హైదరాబాద్​ బల్కంపేట ఎల్లమ్మ ఆలయంలో పది రోజుల పాటు భక్తులకు దర్శనాలు నిలిపివేస్తున్నట్లు... ఆలయ ఈవో అన్నపూర్ణ తెలిపారు. ఆలయంలో ముగ్గురు అర్చకులతో పాటు ఈవోకు కొవిడ్​ సోకడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు.

Darshan stops for devotees at the Balkampet Yellamma Temple
బల్కంపేట ఎల్లమ్మ ఆలయంలో దర్శనాలు నిలిపివేత

By

Published : May 4, 2021, 9:54 PM IST

హైదరాబాద్​లోని బల్కంపేట ఎల్లమ్మ దేవాలయంలోకి భక్తులకు దర్శనాలు నిలిపివేస్తున్నట్లు ఆలయం ఈవో అన్నపూర్ణ తెలిపారు. ఈ నెల 5వ తేది నుంచి 14 వరకు దాదాపు పది రోజుల పాటు భక్తులకు అనుమతి లేదని ఆమె స్పష్టం చేశారు.

దేవాలయంలో అమ్మవారికి ప్రత్యేకంగా ప్రధానార్చకులు ఆధ్వర్యంలోనే పూజా కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఆలయంలో ముగ్గురు అర్చకులతో పాటు ఈఓ అన్నపూర్ణకు కరోనా పాజిటివ్ నిర్ధరణ కావడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. భక్తులు ఈ విషయాన్ని గమనించాలని ఆమె విజ్ఞప్తి చేశారు.

ఇదీ చదవండి: మోదీ- జాన్సన్​​ వర్చువల్ భేటీ.. పదేళ్ల రోడ్​మ్యాప్​ విడుదల

ABOUT THE AUTHOR

...view details