తెలంగాణ

telangana

ETV Bharat / state

జాతీయ సెమినార్​లో జలమండలి వాక్​ ప్రోగ్రాం

హైదరాబాద్ నగరంలో వృథాగా పోతున్న నీటిపై ప్రజల్లో అవగాహన పెంచి... నీటి వృథాను అరికట్టేందుకు వాక్ కార్యక్రమం చేపట్టినట్లు జలమండలి ఎండీ దానకిషోర్ పేర్కొన్నారు. ఘన వ్యర్థాలు వినియోగం, మురుగు నీటి నిర్వహణ వ్యవస్థ, థీమ్​ పార్క్​లు వంటి విషయాల్లో దిల్లీలో జరిగిన స్థిరమైన పారిశుద్ధ్యం అనే జాతీయ సెమినార్​లో రాష్ట్ర జలమండలి ఎండీ పవర్​ పాయింట్​ ప్రజెంటేషన్​ ఇచ్చారు.

By

Published : Aug 19, 2019, 10:34 PM IST

జాతీయ సెమినార్​లో జలమండలి వాక్​ ప్రోగ్రాం

హైదరాబాద్ నగరంలో వృథాగా పోతున్న నీటిపై ప్రజల్లో అవగాహన పెంచి... నీటి వృథాను అరికట్టేందుకు వాక్ కార్యక్రమం చేపట్టినట్లు జలమండలి ఎండీ దానకిషోర్ పేర్కొన్నారు. కేంద్ర గృహ నిర్మాణ, పట్టణాభివృద్ధి, సోషల్ జస్టిస్, ఎంపవర్ మెంట్ శాఖల ఆధ్వర్యంలో దిల్లీలో స్థిరమైన పారిశుద్ధ్యం అనే అంశం పై జాతీయ స్థాయి సెమినార్​ను నిర్వహించారు. దేశంలోని పలు వాటర్ బోర్డుల ప్రతినిధులతో పాటు హైదరాబాద్ నుంచి జలమండలి ఎండీ దానకిషోర్ ఆ సమావేశానికి హాజరయ్యారు. స్వయం సహాయక బృందాలు, సాఫ్ట్​వేర్ ఇంజినీర్లతో పాటు మొత్తం 6 వేల 300 మంది వాలంటీర్లతో నీటి సంరక్షణ అవగాహాన కార్యక్రమాలు చేపడుతున్నట్లు దానకిషోర్ తెలిపారు. పారిశుద్ధ్యంలో జలమండలి తీసుకువచ్చిన నూతన సంస్కరణలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. మురుగునీటి వ్యవస్థ నిర్వహణ సవాళ్లు, ఆ నీటిని శుభ్రపరిచేందుకు యంత్రాల వినియోగం, నూతన జెట్టింగ్ యంత్రాల రూపకల్పన, వాటి పనితీరు వంటి విషయాలను వివరించారు. ఇప్పటికే ఉన్న థీమ్ పార్కులకు తోడు అదనంగా ఐదు పార్కులు నిర్మించడం పట్ల గృహనిర్మాణ, పట్టణాభివృద్ధి శాఖ కార్యదర్శి దుర్గా శంకర్ ముష్రా....జలమండలి ఎండీ దానకిషోర్​ను అభినందించారు. ఓడీఎఫ్ ప్లస్, ఘన వ్యర్థాల నిర్వహణ, వ్యర్థ నీటి నిర్వహణ వంటి విషయాల్లో హైదరాబాద్ ఇతర నగరాలకు ఆదర్శంగా నిలుస్తుందని కొనియాడారు.

జాతీయ సెమినార్​లో జలమండలి వాక్​ ప్రోగ్రాం

ABOUT THE AUTHOR

...view details