తెలంగాణ

telangana

ETV Bharat / state

పోలింగ్ శిక్షణకు అందరూ రావాల్సిందే - DANA

ఎన్నికల నిర్వహణ కోసం నియమించిన పోలింగ్ సిబ్బందికి ఈనెల 17, 18 తేదీల్లో ప్రత్యేక శిక్షణ కార్యక్రమం ఉంటుందని హైదరాబాద్ జిల్లా ఎన్నిక‌ల అధికారి దానకిషోర్ తెలిపారు.

పోలింగ్ శిక్షణకు అందరూ రావాల్సిందే..

By

Published : Mar 15, 2019, 4:56 PM IST

పార్లమెంట్ ఎన్నిక‌ల‌ నిర్వహ‌ణ‌ కోసం నియ‌మించిన పోలింగ్ సిబ్బందికి ఈ నెల 17, 18 తేదీల్లో ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నట్లు హైదరాబాద్ జిల్లా ఎన్నిక‌ల అధికారి దాన‌కిషోర్ తెలిపారు. రోజు రెండు షిఫ్టుల్లో, 8 కేంద్రాల్లో దాదాపు 10వేల మంది పీఓలు, ఏపీఓల‌కు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు చెప్పారు. ఎన్నిక‌ల విధుల‌కు నియ‌మించిన ఉద్యోగుల్లో కొందరు వ్యక్తిగ‌త‌ కార‌ణాలు చూపిస్తూ విధుల మిన‌హాయింపు కోరుతున్నారని... ఎన్నికల విధుల‌కు మిన‌హాయింపు ఉండ‌ద‌ని స్పష్టం చేశారు. ఎన్నిక‌ల విధుల‌కు నియ‌మించిన సిబ్బందిని హాజ‌ర‌య్యేలా సంబంధిత శాఖాధిప‌తులు చ‌ర్యలు చేప‌ట్టాల‌ని సూచించారు. లేనిపక్షంలో వారిపై కూడా ఎన్నిక‌ల నియ‌మావ‌ళిని అనుస‌రించి చ‌ర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

ABOUT THE AUTHOR

...view details