వర్షాకాలంలో తాగునీరు కలుషితం కాకుండా సరఫరా చేయాలని అధికారులను జలమండలి ఎండీ దానకిషోర్ ఆదేశించారు. మురుగునీరు వ్యవస్థ సక్రమంగా నిర్వహిస్తూ రోడ్లపై మురుగు పడకుండ చుడాలన్నారు. వర్షాకాల ప్రణాళికపై ఉన్నతాధికారులతో జలమండలి ఎండీ దానకిషోర్ టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు.
'తాగునీరు కలుషితం కాకుండా సరఫరా చేయాలి' - జల మండలి ఎండీ దానకిషోర్
హైదరాబాద్లో వానాకాలంలో తాగునీరు కలుషితం కాకుండా సరఫరా చేయాలని జలమండలి ఎండీ దానకిషోర్ అధికారులను ఆదేశించారు. వర్షాకాల ప్రణాళికపై అధికారులతో ఆయన టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు.
'తాగునీరు కలుషితం కాకుండా సరఫరా చేయాలి'
వర్షాకాలం వచ్చే ఇబ్బందులపై కింది స్థాయి సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మ్యాన్ హోల్స్ తప్పనిసరిగా మూసి ఉంచడంతోపాటు సేఫ్టీ గ్రిల్స్ ఏర్పాటు చేయాలన్నారు. తీసిన పూడికను వెంటనే అక్కడి నుంచి తరలించాలన్నారు. బోర్డు ఆదాయంపై ప్రత్యేక దృష్టి సారించాలని చెప్పారు. వాణిజ్య వినియోగదారుల నుంచి వంద శాతం బిల్లులు వసూలు చేయాలని సిబ్బందికి ఆదేశాలు జారీచేశారు.
ఇదీ చూడండి :ఆర్టీసీ పార్సిల్ కొరియర్, కార్గో సేవలను ప్రారంభించిన మంత్రి పువ్వాడ