తెలంగాణ

telangana

By

Published : Aug 25, 2020, 3:46 AM IST

ETV Bharat / state

ఓటీఎస్ వాహనాలను ప్రారంభించిన దానకిశోర్

వ‌న్​టైమ్ సెటిల్ మెంట్ ప‌థ‌కంలో భాగంగా వినియోగ‌దారుల‌ు బ‌కాయిల‌ను చెల్లించేందుకు కార్యాల‌యాల చుట్టూ తిర‌గ‌కుండా ఉండేందుకు జీహెచ్​ఎంసీ తగు ఏర్పాట్లు చేసింది. అందులో భాగంగా సెక్షన్‌కు ఒక‌టి చొప్పున 100 మొబైల్‌ వాహనాల‌ను అందుబాటులోకి తీసుకొ‌చ్చిన‌ట్లు జలమండలి ఎండీ దానకిశోర్ తెలిపారు.

Dana kishore launches OTS vehicles in Hyderabad city
ఓటీఎస్ వాహనాలను ప్రారంభించిన దానకిశోర్

జ‌ల‌మండ‌లి వ‌న్​టైమ్ సెటిల్ మెంట్ ప‌థ‌కంలో భాగంగా మొబైల్ క‌లెక్షన్ వాహనాలు అందుబాటులోకి వచ్చాయి. వీటిని జలమండలి ఎండీ దాన‌కిశోర్ జెండా ఊపి ప్రారంభించారు. పాత బ‌కాయిల‌ను వినియోగ‌దారులు చెల్లించేందుకు ఈ ప‌థకాన్ని అందుబాటులోకి తీసుకువచ్చిన్నట్టు వివ‌రించారు. ఇందులో భాగంగా బ‌కాయిదారుల‌కు బిల్లుల‌పై వేసిన మొత్తం వ‌డ్డీ రాయితీ ఇవ్వనున్నట్టు ‌ఆయన తెలిపారు. ఈ ప‌థకం వ‌చ్చేనెల 15 వ‌ర‌కు అమ‌లులో ఉంటుంద‌ని వివ‌రించారు.

వినియోగదారులు వాహనాల వ‌ద్దకు వెళ్తే... ఓటీఎస్ ప‌థ‌కానికి అర్హులా? కాదా?.. ఒక వేళ అయితే మీకు ఎంత వ‌డ్డీ రాయితీ వస్తుంది, అనే విష‌యాల‌ను తెలియ‌జేస్తారు. బిల్లులు చెల్లించాలనుకుంటే ఈ వాహనాల వ‌ద్దనే చెల్లించ‌వ‌చ్చునని తెలిపారు. మీకు చెల్లింపు చేసిన‌ట్లుగా వెంట‌నే ర‌సీదులు ఇస్తారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జ‌ల‌మండ‌లి టెక్నిక‌ల్ డైరెక్టర్ వి.ఎల్. ప్రవీణ్ కుమార్​తో పాటు రెవెన్యూ సీజీఎమ్‌ పాల్గొన్నారు.

ఇదీ చదవండి-సెప్టెంబర్​ 1 నుంచి మెట్రో రైల్​​ సర్వీసులు!

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details