వర్షాల వల్ల గుంతలమయమైన రోడ్లకు ఒకటి రెండు రోజుల్లో పూర్తి స్థాయిలో మరమ్మతులు పూర్తి చేస్తామని జీహెచ్ఎంసీ కమిషనర్ దానకిశోర్ అన్నారు. గత కొన్ని రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు నగరవ్యాప్తంగా నాలుగు వేలకు పైగా గోతులు ఏర్పడినట్లు గుర్తించామన్నారు. వాటిలో ఇప్పటి వరకు 50 శాతం గుంతలను పూడ్చేశామని తెలిపారు. మిగతా వాటిని సాధ్యమైనంత తొందరగా పూర్తిచేస్తామన్నారు. వర్షాకాలంలో శిథిలావస్థకు చేరిన భవనాలు కూలిపోయే ప్రమాదం ఉన్నందున వాటిలో ఉండొద్దని దానకిశోర్ సూచించారు. వెంటనే ఖాళీ చేయాలని కోరారు.
'గుంతలు పడిన రోడ్లకు రెండురోజుల్లో మరమ్మతులు'
భాగ్యనగరంలో మూడు రోజులుగా ఎడతెరిపిలేకుండా కురిసిన వర్షాలకు పాడైపోయిన రోడ్లకు మరమ్మతు పనులను జీహెచ్ఎంసీ శరవేగంగా పూర్తి చేస్తోంది. కూకట్పల్లి సర్కిల్ పరిధిలో పలు ప్రాంతాల్లో మరమ్మతు పనులను జీహెచ్ఎంసీ కమిషనర్ దానకిశోర్ పరిశీలించారు.
'గుంతలు పడిన రోడ్లకు రెండురోజుల్లో మరమ్మతులు'