తెలంగాణ

telangana

ETV Bharat / state

Dalit Bandhu Scheme Second Phase : త్వరలో 'దళితబంధు' రెండో విడత.. ఈ అర్హతలు, పత్రాలు, మీరు కలిగి ఉన్నారా.?

Dalit Bandhu Scheme Second Phase : తెలంగాణ ప్రభుత్వం దళితుల సమగ్ర అభివృద్ధి కోసం 'దళిత బంధు' అనే సంక్షేమ పథకానికి శ్రీకారం చుట్టింది. స్వశక్తితో, స్వావలంబనతో దళిత జాతి జీవించాలనే సంకల్పంతో ముఖ్యమంత్రి కేసీఆర్​ ఈ పథకానికి నాంది పలికారు. అందులో భాగంగా ప్రతి దళిత కుటుంబానికి ఈ స్కీమ్​ ద్వారా రూ.10లక్షలు ఆర్థిక సాయం అందిస్తున్నారు. ఇంతకీ దళితబంధు పథకానికి ఎవరెవరు అర్హులు, ఏ విధంగా అప్లై చేసుకోవాలి, దరఖాస్తు సమయంలో ఏయే పత్రాలు అవసరమో ఇప్పుడు తెలుసుకుందాం..

Dalit Bandhu Scheme in Telangana
Dalit Bandhu Scheme Second Phase

By

Published : Aug 11, 2023, 12:54 PM IST

Updated : Aug 12, 2023, 6:31 AM IST

Dalit Bandhu Scheme Second Phase :సామాజిక వివక్ష, అణచివేతకు గురవుతున్న దళితుల సమగ్ర అభివృద్ధి కోసం తెలంగాణ ప్రభుత్వం 'దళిత బంధు' అనే సంక్షేమ పథకానికి శ్రీకారం చుట్టింది. రాష్ట్రంలో ఉన్న దళిత కుటుంబాల్లో ఆర్థిక సాధికారత, స్వావలంబన సాధించేందుకు సర్కార్ ఈ పథకాన్ని అమలు చేస్తోంది. ముఖ్యమంత్రి కేసీఆర్ గతంలో చేసిన.. దళితులకు మూడెకరాల భూమి అనే ప్రకటన సక్రమంగా అమలు కాకపోవడంతో పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి. ఈ క్రమంలో అణగారిన వర్గాల ఓట్లను ఆకర్షించేందుకు తెలంగాణ సర్కార్ హుజూరాబాద్ ఉపఎన్నికలకు ముందు'దళితబంధు పథకాన్ని'(Dalit Bandhu Scheme)తీసుకొచ్చింది.

Dalit Bandhu Scheme in Telangana : దళితులను వ్యాపారవేత్తలుగా ఈ దళితబంధు పథకం ద్వారా తీర్చిదిద్దాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు సీఎం కేసీఆర్ పలు వేదికల ద్వారా వెల్లడించారు. ఈ పథకం కింద రాష్ట్రంలోని ఒక్కో నిరుపేద దళిత కుటుంబానికి రూ. 10 లక్షల ఆర్థిక సాయాన్ని తెలంగాణ సర్కార్ అందజేస్తోంది. ఈ పథకం ద్వారా అందిస్తున్న ఆర్థికసాయంతో ఇప్పటికే చాలామంది ఎంట్రప్రెన్యూర్లుగా మారారు. ప్రస్తుతం దేశంలో ఉన్న సంక్షేమ పథకాలలో అతి పెద్ద నగదు బదిలీ పథకంగా దళితబంధు నిలిచింది.

దళిత బంధు అర్హతలు.. దరఖాస్తు వివరాలు ఇవే

Dalit Bandhu Scheme Eligibility : తెలంగాణ ఉద్యమానికి నాందిగా నిర్వహించిన సింహగర్జన మొదలు తాను ఎంతగానో అభిమానించే రైతుబంధు వరకు సీఎం కేసీఆర్ కరీంనగర్ జిల్లా నుంచే అనేక పథకాలను ప్రారంభించారు. ఈ క్రమంలో ఇక్కడి నుంచి ఈ పథకానికి శ్రీకారం చుట్టాలనుకున్నారు. కానీ విపక్షాలు, రాజకీయ విశ్లేషకుల విమర్శల వల్ల 2021 ఆగస్టు 5న తాను దత్తత తీసుకున్న యాదాద్రి జిల్లాలోని వాసాలమర్రి గ్రామం నుంచి సీఎం కేసీఆర్ దళితబంధు పథకాన్ని ప్రారంభించారు. కానీ, అసలైన దళిత బంధు పథకాన్ని(Huzurabad Assembly constituency)మాత్రం 2021, ఆగస్టు 16న కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ నియోజకవర్గంలోని శాలపల్లిలో ముఖ్యమంత్రి కేసీఆర్ లాంఛనంగా ప్రారంభించారు.

దళిత బంధు పథకం ద్వారా వచ్చిన డబ్బుతో ఏయే వ్యాపారాలు చేయొచ్చంటే..

How to Apply for Dalit Bandhu : తెలంగాణ వ్యాప్తంగా ఈ పథకం దశల వారీగా అమలవుతోంది. ఇప్పటికే తొలి విడతలో రాష్ట్రంలో దాదాపు 35 వేల మందికి దళితబంధు లబ్ది చేకూరింది. ఈ పథకం రెండో విడత సాయానికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వగా.. త్వరలో దరఖాస్తుల ప్రక్రియ షురూ కానుంది. ఈ దఫా ప్రతి నియోజకవర్గానికి 1100 మంది చొప్పున లబ్దిదారులను ఎంపిక చేయాలని కలెక్టర్లను ఎస్సీ సంక్షేమ శాఖ ఆదేశించింది. రెండో విడత దళితబంధు పథకం ఆర్థిక సాయం కోసం రాష్ట్ర బడ్జెట్​ 2023-24లో రూ.17,700 కోట్లను కేటాయించింది. అయితే ఈ రెండో విడత ప్రక్రియను మొత్తం యాప్ ద్వారా చేయనున్నట్లు తెలుస్తోంది. రిజిస్ట్రేషన్​తో మొదలుకొని వెరిఫికేషన్ యూనిట్ అప్రూవల్ వరకు ఇకపై యాప్​ ద్వారానే చేయనున్నట్లు సమాచారం. ఈ క్రమంలో అసలు ఈ దళితబంధు పథకానికి ఎలా దరఖాస్తు చేసుకోవాలి, అర్హతలు ఏంటి, ఏయే పత్రాలు అవసరమో ఇప్పుడు తెలుసుకుందాం..

Dalit Bandhu 2nd Phase : 'ఎమ్మెల్యేలు చెప్పిన వారికే దళితబంధు..' రెండో విడతలోనూ సేమ్​ టు సేమ్

దళితబంధు పథకానికి అర్హతలివే :

  • ఈ పథకానికి దరఖాస్తు చేసుకునే వ్యక్తి దళితుడై ఉండాలి.
  • దరఖాస్తుదారుడు దారిద్ర్యరేఖకు దిగువన ఉన్నవాడై ఉండాలి.
  • ఈ పథకానికి అప్లై చేసుకునే వారు తెలంగాణలో శాశ్వత నివాసిగా గుర్తింపు పొంది ఉండాలి.
  • ప్రభుత్వ ఉద్యోగుల కుటుంబాలకు కూడా దళిత బంధు పథకం అమలవుతుంది.
  • గతంలో వివిధ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందుకున్నవారు కూడా ఈ పథకానికి అర్హులు.

దరఖాస్తు సమయంలో అవసరమైన పత్రాలు :

  • రేషన్​కార్డు
  • ఓటర్ గుర్తింపు కార్డు
  • ఆధార్ కార్డు
  • కుల ధ్రువీకరణ పత్రం
  • బ్యాంక్ అకౌంటు వివరాలు
  • నివాస ధ్రువీకరణ పత్రం
  • చెల్లుబాటు అయ్యే ఫోన్​నంబర్

Dalit Bandhu In Telangana : దళితబంధు రెండో విడత అమలుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి

ఎంపిక ప్రక్రియ ఇలా జరగనుంది..

  • రాష్ట్రంలోని అన్ని దళిత కుటుంబాల స్థితి గతులు, వివరాలు తెలుసుకుని, నిబంధనలను అనుసరించి లబ్దిదారుల ఎంపిక
  • లబ్దిదారుని నుంచి రూ.10వేలతో సర్కార్ భాగస్వామ్యంతో రక్షణ నిధి ఏర్పాటు
  • లబ్దిదారుల్లో ఎవరికైనా ఆకస్మాత్తుగా ఆపద వచ్చినప్పుడు ఆ రక్షణ నిధి నుంచి సహాయం అందజేత
  • ఈ పథకం పర్యవేక్షణకు ముఖ్యమంత్రి కార్యాలయంలో ఒక ప్రత్యేక కార్యదర్శి ఉంటారు.
  • ఈ స్కీమ్​ అమలు తీరును గమనించేందుకు గ్రామ, మండల, జిల్లా, రాష్ట్ర స్థాయిలో ఆరుగురి సభ్యులతో దళితబంధు కమిటీల ఏర్పాటు
  • రాష్ట్రంలో ఈ పథకం ద్వారా సుమారు 17 లక్షల దళిత కుటుంబాలకు లబ్ది
  • ఈ పథకం ద్వారా వచ్చే ఆర్థికసాయం ఎలాంటి మధ్యవర్తిత్వం లేకుండా నేరుగా లబ్దిదారుని అకౌంట్​లోకి జమ అవుతుంది.

దళితబంధు ద్వారా వచ్చిన డబ్బు ద్వారా ఏయే వ్యాపారాలు చేసుకోవచ్చంటే..?

దళితబంధు ద్వారా వచ్చిన రూ.10లక్షల ఆర్థిక సాయాన్ని లబ్దిదారుడు సొంతంగా తనకు నచ్చిన వ్యాపారాన్ని పెట్టుకునేందుకు ఉపయోగించవచ్చు. దాదాపు 30కి పైగా పైగా వ్యాపార ఆలోచనలను ప్రభుత్వం సూచించింది. ఈ పథకం ద్వారా వచ్చిన ఆర్థిక సాయాన్ని ప్రభుత్వం సూచించిన ఆయా యూనిట్ల ఏర్పాటుకు మాత్రమే వినియోగించాల్సి ఉంటుంది.

ఆ యూనిట్లు ఏంటంటే.. వరికోత కోసే హార్వెస్టర్లు, నాటు వేసే మెషిన్లు, ఆటో ట్రాలీలు, ట్రాక్టర్లు, వంటి వాటిని కొనుక్కోవచ్చని తెలిపింది. కోళ్ల పరిశ్రమ, పాల పరిశ్రమ, ఆయిల్ మిల్, గ్రైడింగ్ మిల్, మెడికల్ షాపులు, పెట్రోల్ పంపు, ఫర్టిలైజర్ షాపులు, ఫర్నీచర్ దుకాణాలు, మొబైల్ దుకాణాలు, హోటళ్లు, క్లాత్ ఎంపోరియం, స్టీల్, సిమెంట్, బ్రిక్ వంటి వ్యాపారాలు, బార్లు.. తదితర షాపులు సొంతంగా పెట్టుకుని స్వావలంబన పొందవచ్చని పేర్కొంది.సర్కార్సూచించనవే కాకుండా ఇంకా వేరే ఏదైనా వృత్తి ఎంచుకోవాలనుకున్నా వారి ఆలోచనల ప్రకారం దళిత బంధు లబ్దిదారులు(Dalit Bandhu Beneficiaries Businesses) నడుచుకోవచ్చు. కొందరు కలిసి పెద్ద వ్యాపారానికి కలిసి పెట్టుబడులు పెట్టుకొని శ్రీకారం చుట్టాలనుకున్నా వాటిని స్వాగతిస్తామని ప్రభుత్వం తెలిపింది.

ఆర్థికసాయంతో పాటు దళిత రక్షణ నిధి : దళితబంధు పథకం ద్వారా ఇచ్చే ఆర్థిక సాయంతోపాటుదళిత రక్షణ నిధి కింద దళితుల్లో ఎవరైనా ఆపదలో ఉంటే వారిని ఆదుకునేందుకు ఒక నిధిని కూడా ఏర్పాటు చేసింది. దీనికోసం వారికిచ్చే 10 లక్షలలో 10 వేలు ప్రతి ఒక్కరి నుంచి ప్రభుత్వం తీసుకుని రక్షణనిధికి కేటాయిస్తుంది. దీనికి జిల్లా కలెక్టర్ బాధ్యత వహిస్తారు. అలాగే లబ్దిదారులకు ఆర్థికసాయాన్ని అందించేటప్పుడు ఎలక్ట్రానిక్ చిప్‌తో కూడిన ఐడెంటీ కార్డును జారీ చేస్తారు. దీంతో ఈ పథకం ద్వారా లబ్దిదారుడు పొందుతున్న పురోగతిని ప్రభుత్వం మానిటర్ చేస్తోంది.

Dalit Bandhu in Telangana: 'అణగారిన బతుకుల్లో.. కొత్త కాంతులు నింపుతున్న దళితబంధు'

దళిత బంధు నిధులతో రైస్‌మిల్లు.. ఈ యూనిట్‌ రాష్ట్రానికే ఆదర్శం: కేటీఆర్‌

దళితబంధు వాహనాలు అయిదేళ్లు అమ్మలేరు!

Last Updated : Aug 12, 2023, 6:31 AM IST

ABOUT THE AUTHOR

...view details