Dalit Bandhu Scheme Second Phase :తెలంగాణలోదళితబంధు(Dalit Bandhu) రెండో విడతలో తీసుకున్న దరఖాస్తుల పరిష్కార ప్రక్రియను నిలిపివేస్తున్నట్లు ఎస్సీ సంక్షేమశాఖ తెలిపింది. దాదాపు 50,000 దరఖాస్తులపై విధానపరమైన స్పష్టత వచ్చేవరకు ఎలాంటి నిర్ణయం తీసుకోకూడదని నిర్ణయించింది. మరోవైపు ఇప్పటికే యూనిట్లు మంజూరై, కొంత నగదు విడుదలైన వారికి మిగతా సహాయాన్ని అందించాలా? లేదా? నిర్ణయం తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వానికి ఈ శాఖ లేఖ రాసింది.
Consideration of Applications Stopped Dalit Bandhu : మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలోని బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రారంభించిన ఈ పథకం కింద రాష్ట్రంలో తొలివిడత 38,323 కుటుంబాలకు దళితబంధు యూనిట్లు మంజూరయ్యాయి. ఇందుకోసం అప్పటి సర్కార్ రూ.4,441.8 కోట్లు ఖర్చు చేసింది. ఒక్కో దళిత కుటుంబానికి అప్పటి ప్రభుత్వం రూ.10 లక్షల చొప్పున సహాయంతో యూనిట్లు మంజూరు చేసింది. తొలివిడతలో ఎంపికైన లబ్ధిదారులందరికీ నిధులు వచ్చాయి.
దళితబంధు వాహనాలు అయిదేళ్లు అమ్మలేరు!
రెండో విడతగా నియోజకవర్గానికి 1100 మంది :రెండో విడతగా నియోజకవర్గానికి 1100 మంది చొప్పున (హుజూరాబాద్ మినహా) సుమారు 1.30 లక్షల కుటుంబాలకు పథకాన్ని అమలు చేయాలని గత సర్కార్ లక్ష్యంగా పెట్టుకుంది. ఈ మేరకు అన్ని నియోజకవర్గాల్లో కలిపి జిల్లా కలెక్టర్లకు 50,000లకు పైగా దరఖాస్తులు అందాయి. ఈ వివరాలను కలెక్టర్లు దళితబంధు పోర్టల్‌లో అప్‌లోడ్ చేశారు. దళితబంధు రెండోవిడత కార్యక్రమంలో పైలట్ ప్రాజెక్టు కింద 400 మందిని ఎంపిక చేసి, వారందరికి యూనిట్లు మంజూరు చేశారు.
Dalit Bandhu 2nd Phase : 'ఎమ్మెల్యేలు చెప్పిన వారికే దళితబంధు..' రెండో విడతలోనూ సేమ్ టు సేమ్