విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించేందుకు స్వయం ప్రతిపత్తి కలిగిన విద్య ఏర్పాటు చేయాలని దళిత బహుజన ఫ్రంట్ జాతీయ కార్యదర్శి శంకర్ అన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో చదువుతున్న పిల్లలకు తరగతుల వారీగా వారి విద్యా సామర్ధ్యాల గురించి నిర్వహించిన పరీక్షల్లో దాదాపు 7 వేల మంది విద్యార్థులు సరళమైన పదాలు కూడా రాయలేక, చదవలేకపోతున్నారన్నారు. అధిక శాతం ప్రభుత్వ బడిలో చదువుతున్న పిల్లలేనని హైదరాబాద్ ప్రెస్ క్లబ్లో ఆయన పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం దీన్ని ఓ సంక్షోభంగా గుర్తించి తగిన చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. దీనిపై ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసి దానిని ప్రభుత్వం ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేయాలన్నారు.
'విద్యార్థులకు నాణ్యమైన విద్యనందించాలి' - Dalit bahujan front_On_School_Education_
రాష్ట్రంలో చదువుతున్న పిల్లలకు సరైన విద్యాసామర్థ్యం లేదని దళిత బహుజన ఫ్రంట్ జాతీయ కార్యదర్శి శంకర్ హైదరాబాద్ ప్రెస్‌క్లబ్‌లో తెలిపారు.
!['విద్యార్థులకు నాణ్యమైన విద్యనందించాలి'](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-4186650-thumbnail-3x2-vysh.jpg)
'విద్యార్థులకు నాణ్యమైన విద్యనందించాలి'