హైదరాబాద్ జూబ్లీహిల్స్ రెహ్మత్‌నగర్‌లోని సుమారు వెయ్యి మంది పేద ప్రజలకు భాజపా సీనియర్ నాయకులు కొలను సత్యనారాయణ ఆధ్వర్యంలో నిత్యావసరాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జూబ్లీహిల్స్ పోలీసు సిబ్బంది పాల్గొని పేద ప్రజలకు సరుకులను అందజేశారు. లాక్డౌన్ కారణంగా ప్రజలు పడుతున్న ఇబ్బందులను గ్రహించి సత్యనారాయణ చేస్తున్న కృషిని పోలీసులు కొనియాడారు.
నిరుపేదలకు నిత్యావసరాలను పంపిణీ చేసిన భాజపా నాయకులు - లాక్డౌన్ ఎఫెక్ట్
లాక్డౌన్ నేపథ్యంలో ప్రజలు ఇబ్బందులు పడకుండా హైదరాబాద్ రెహ్మత్‌నగర్ డివిజన్లో భాజపా నాయకులు కొలను సత్యనారాయణ నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జూబ్లీహిల్స్ పోలీసులు పాల్గొని పేద ప్రజలకు ఆ సామాగ్రిని అందజేశారు.
నిరుపేదలకు నిత్యావసరాలను పంపిణీ చేసిన భాజపా నాయకులు
కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు ప్రజలు స్వీయ నిర్బంధాన్ని పాటించాలని.. ప్రభుత్వ నిబంధనలు ఉల్లంఘించవద్దని సత్యనారాయణ కోరారు. అత్యవసరమైతేనే రోడ్లపైకి రావాలని భౌతిక దూరాన్ని పాటించాలని ఆయన ప్రజలకు సూచించారు. ఈ కార్యక్రమాన్ని ప్రజలు పెద్ద ఎత్తున గుమిగూడి రావడం.. సామాజిక దూరం పాటించక పోవడం వల్ల పోలీసులు రంగంలోకి దిగి ప్రజలను తరిమివేశారు.
Last Updated : Apr 4, 2020, 7:47 PM IST