అభాగ్యులను, పేద బడుగు బలహీన వర్గాల ప్రజలను రాజకీయాలకతీతంగా ఆదుకోవడమే మానవత్వమని భాజపా రాష్ట్ర మాజీ అధ్యక్షులు డాక్టర్ లక్ష్మణ్ అన్నారు. హైదరాబాద్ ముషీరాబాద్ నియోజకవర్గంలోని జెమినీ కాలనీలో ఉంటున్న పూస కుటుంబం ఆధ్వర్యంలో.. జీహెచ్ఎంసీ పారిశుద్ధ్య కార్మికులకు డాక్టర్ కె. లక్ష్మణ్, ముషీరాబాద్ నియోజకవర్గ జీహెచ్ ఎంసీ డీఎం సి. ఉమా ప్రకాశ్, తదితరులు బియ్యం, పప్పు, కూరగాయల వంటి నిత్యావసర కిట్లను అందజేశారు.
'ప్రతి భాజపా కార్యకర్త ఐదుగురు పేదలను ఆదుకోవాలి' - నిత్యావసరాలు పంపిణీ చేసిన భాజపా లక్ష్మణ్
హైదరాబాద్ ముషీరాబాద్ నియోజకవర్గంలోని జీహెచ్ఎంసీ పారిశుద్ధ్య కార్మికులకు పూస కుటుంబం బాసటగా నిలిచింది. భాజపా రాష్ట్ర మాజీ అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్ చేతుల మీదుగా నిరుపేదలకు నిత్యావసరాలను పంపిణీ చేశారు.

'ప్రతి భాజపా కార్యకర్త ఐదుగురు పేదలను ఆదుకోవాలి'
భాజపా ప్రతి కార్యకర్త ఐదుగురిని ఆదుకోవాలని పార్టీ ఇచ్చిన ఆదేశానుసారం.. దాదాపు 15 వేల మంది పేద ప్రజలను నిత్యావసర సరుకులను అందించడం జరిగిందని.. అదేవిధంగా 30 వేల మందికి ఆహార పొట్లాలను పంపిణీ చేయడం జరిగిందని డాక్టర్ కె. లక్ష్మణ్ వివరించారు.
ఇదీ చూడండి:సూర్యాపేట జిల్లాలో కొత్తగా 16 కరోనా పాజిటివ్ కేసులు
TAGGED:
ముషీరాబాద్ తాజా వార్త