హైదరాబాద్లోని పూసల బస్తీ, సీతారాం బాగ్లో శ్రీ కృష్ణ ట్రస్ట్ ఆధ్వర్యంలో వెయ్యి మంది నిరుపేదలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ప్రజలు ఇళ్ల వద్దే ఉండాలని శ్రీ కృష్ణ ట్రస్ట్ ప్రతినిధులు ఇంటి వద్దకే సరుకులు తెచ్చి ఇస్తారని తెలిపారు.
శ్రీ కృష్ణ ట్రస్ట్ ఆధ్వర్యంలో సరుకుల పంపిణీ - శ్రీ కృష్ణ ట్రస్ట్ ఆధ్వర్యంలో సరుకులు పంపిణీ
లాక్డౌన్ వేళ ఉపాధి లేక అవస్థలు పడుతున్న నిరుపేదలకు పలువురు నిత్యావసర సరుకులు పంపిణీ చేస్తున్నారు. లాక్డౌన్ నిబంధనలు పాటించాలని.. అనవసరంగా ఇళ్ల నుంచి బయటకు రావొద్దని సూచిస్తున్నారు.
![శ్రీ కృష్ణ ట్రస్ట్ ఆధ్వర్యంలో సరుకుల పంపిణీ sri krishna trust](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7068407-109-7068407-1588671023157.jpg)
శ్రీ కృష్ణ ట్రస్ట్ ఆధ్వర్యంలో సరుకులు పంపిణీ
కరోనా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో అందరూ జాగ్రత్తలు పాటించాలని సూచించారు. లాక్డౌన్ నిబంధనలు కచ్చితంగా పాటించి వ్యాప్తి కట్టడికి తమ వంతు కృషి చేయాలన్నారు.
ఇవీ చూడండి: ఆ జిల్లాల్లో సడలింపులు ఇవ్వొద్దు: వైద్యఆరోగ్య శాఖ