తెలంగాణ

telangana

ETV Bharat / state

దక్షిణ భారతదేశంలో తొలిసారి  దాదాసాహెబ్​ ఫాల్కె అవార్డులు - Dadasaheb Phalke Awards

వచ్చే నెల 20న మాదాపూర్​లోని ఎన్​ కన్వెన్షన్ సెంటర్​లో దాదాసాహెబ్ ఫాల్కె అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్ (డీపీఐఎఫ్ఎఫ్) అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమం నిర్వహించనున్నట్లు సీఈఓ అభిషేక్ మిశ్రా తెలిపారు.  దీనికి  సంబంధించిన ఆహ్వాన పత్రికను నిర్వాహకులు విడుదల చేశారు.

దక్షిణ భారతదేశంలో తొలిసారి  దాదాసాహెబ్​ ఫాల్కె అవార్డులు

By

Published : Aug 27, 2019, 12:53 PM IST

దాదాసాహెబ్ ఫాల్కె అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్ అవార్డులకు హైదరాబాద్ నగరం వేదిక కానుంది. వచ్చే నెల 20వ తేదీన మాదాపూర్​లోని ఎన్ కన్వెన్షన్ సెంటర్​లో ఈ అవార్డుల ప్రదానోత్సవం నిర్వహించనున్నట్లు డీపీఐఎఫ్ఎఫ్ సీఈఓ అభిషేక్ మిశ్రా తెలిపారు. కార్యక్రమానికి సంబంధించిన ఆహ్వాన పత్రికను నిర్వాహకులు విడుదల చేశారు. దక్షిణ భారతదేశంలో తొలిసారి ఈ అవార్డుల కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు మిశ్రా పేర్కొన్నారు. మొత్తం 15 విభాగాల్లో అవార్డులను అందించనున్నట్లు ఆయన స్పష్టం చేశారు.

దక్షిణ భారతదేశంలో తొలిసారి దాదాసాహెబ్​ ఫాల్కె అవార్డులు

ABOUT THE AUTHOR

...view details