అధిక విద్యుత్ బిల్లులను నిరసిస్తూ హైదరాబాద్ విద్యుత్ సౌధతోపాటు అన్ని జిల్లా కేంద్రాల్లో ధర్నాలకు భాజపా పిలుపునిచ్చిన నేపథ్యంలో ఆ పార్టీ నేతలను పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకుంటున్నారు. ధర్నాలో పాల్గొనడానికి వెళ్తున్న భాజపా తెలంగాణ మైనారిటీ మోర్చా అధికార ప్రతినిధి మీర్ ఫిరాసత్ అలీని పోలీసులు అరెస్ట్ చేశారు. అతనితోపాటు బక్రీ, మిస్టర్ అబ్బాస్ రజాఖాన్, మిస్టర్ మీర్ అబ్రార్ అలీ రజ్విను అరెస్ట్ చేసి దబీర్ పురా పోలీసు స్టేషన్కు తరలించారు.
విద్యుత్ బిల్లుల పెంపును నిరసిస్తూ భాజపా ఆందోళన.. నేతల అరెస్టు - భాజపా ధర్నా: రాష్ట్ర మైనారిటీ మోర్చా మీర్ ఫిరాసత్ అలీ అరెస్ట్
భాజపా తెలంగాణ మైనారిటీ మోర్చా అధికార ప్రతినిధి మీర్ ఫిరాసత్ అలీని దబీర్ పురా పోలీసులు అరెస్ట్ చేశారు. రాష్ట్రంలో అదనపు విద్యుత్ బిల్లులను నిరసిస్తూ భాజపా చేపట్టిన ధర్నాలో పాల్గొనకుండా పోలీసులు అడ్డుకున్నారు.
భాజపా ధర్నా: భాజపా రాష్ట్ర ప్రతినిధి మీర్ ఫిరాసత్ అలీ అరెస్ట్