హైదరాబాద్ ఎల్బీనగర్లోని చిత్ర లేఔట్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గణేష్ నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. భక్తి శ్రద్ధలతో భక్తులు పూజలు చేస్తున్నారు. వేడుకల్లో భాగంగా సోమవారం నాడు దాండియా నృత్య ప్రదర్శన నిర్వహించారు. మహిళలు, పురుషులు, చిన్నారులు అందరు అధిక సంఖ్యలో పాల్గొని కోలాటాలు ఆడుతూ సందడి చేశారు. ప్రతి సంవత్సరం ఇలాంటి సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని కాలనీ అధ్యక్షుడు అంజిరెడ్డి అన్నారు.
గణనాథుని ఎదుట దాండియా నృత్యాలు - Layout Welfare Association
హైదరాబాద్ చిత్ర లే అవుట్ కాలనీలోని ఓ గణేశ్ మండపం వద్ద దాండియా నృత్య ప్రదర్శన కార్యక్రమం నిర్వహించారు. చిన్న,పెద్దలంతా కలసి కోలాటాలు ఆడుతూ సందడి చేశారు.
గణనాథుని ఎదుట దాండియా నృత్యాలు