తెలంగాణ

telangana

By ETV Bharat Telangana Team

Published : Nov 1, 2023, 4:59 PM IST

Updated : Nov 1, 2023, 10:54 PM IST

ETV Bharat / state

కాంగ్రెస్‌తో పొత్తులపై చర్చలు ఇంకా కొనసాగుతున్నాయి

D Raja on CPI-Congress Parties Alliance in Telangana : తెలంగాణలో జరగబోయే ఎన్నికలకు కాంగ్రెస్​, సీపీఐ పొత్తులో భాగంగా.. తాము అడిగిన సీట్లు ఇస్తారనే నమ్మకం ఉందని సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి.రాజా ధీమా వ్యక్తం చేశారు. సీట్ల కేటాయింపుపై చర్చలు జరుగుతున్నాయని పేర్కొన్నారు.

Telangana Assembly Elections 2023
CPI- Congress Parties Alliance

D Raja on CPI-Congress Parties Alliance in Telangana :కేంద్రంలో బీజేపీని ఓడించేందుకు కలిసి వచ్చే వారితో పొత్తులు పెట్టుకుంటామని సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి.రాజా వెల్లడించారు. తెలంగాణలో కాంగ్రెస్‌తో పొత్తులపై ఇంకా చర్చలు కొనసాగుతున్నాయని స్పష్టం చేశారు. హైదరాబాద్‌లో సీపీఐ నేత నారాయణ, రాష్ట్ర కార్యదర్శి సాంబశివరావుతో కలిసి అయన మాట్లాడారు.

Congress and CPM Alliance in Telangana : కాంగ్రెస్​, సీపీఎం పొత్తు.. సీట్ల విషయంలో స్పష్టత వస్తేనే భేటీ

Telangana Assembly Elections 2023 : సీపీఐతో పొత్తులో భాగంగా కాంగ్రెస్‌ను తాము అడిగిన సీట్లు ఇస్తారనే నమ్మకం ఉందని రాజా ధీమా వ్యక్తం చేశారు. ఇండియా కూటమిలో తమ పాత్ర కీలకంగా ఉంటుందన్నారు. కొత్తగూడెం, బెల్లంపల్లి టికెట్లు కోరామని.. బెల్లంపల్లి కాకుండా చెన్నూరు తీసుకోమన్నారని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ తెలిపారు. సీపీఎం సీట్లపై చర్చ జరుగుతుందని.. ఆ పార్టీ సీట్లపై స్పష్టత రాలేదని నారాయణ పేర్కొన్నారు. రేపో మాపో మిగతా అభ్యర్థులను కాంగ్రెస్‌ ప్రకటిస్తుందన్నారు. ఇండియా కూటమి బలపడడం వల్ల బీజేపీని నిలువరించవచ్చునని అభిప్రాయపడ్డారు. వివేక్ కాంగ్రెస్‌లో చేరడం మంచి పరిణామన్నారు.చెన్నూరులో సీపీఐ గెలుపునకు వివేక్ కృషి చేస్తారన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో వివేక్ వెంకటస్వామి విజయం కోసం కృషి చేస్తామని స్పష్టం చేశారు.

చంద్రబాబు అరెస్టు కక్షపూరితమైందన్న అయన.. న్యాయం బతికే ఉన్నదని చెప్పడానికి బెయిల్ నిదర్శనమన్నారు. జైల్లో ఉండాల్సిన వాళ్లు బయట.. బయట ఉండాల్సిన వాళ్లు లోపల ఉన్నారని పేర్కొన్నారు. తమ విషయంలో కాంగ్రెస్ మాట నిలబెట్టుకుంటుందని భావిస్తున్నామని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు తెలిపారు.

Left Parties Alliance in Telangana :మరోవైపు కాంగ్రెస్ పార్టీ సీట్ల సర్దుబాటు విషయంలో అనుసరిస్తున్న వైఖరిపై సీపీఎం రాష్ట్ర సీనియర్ నాయకుడు జూలకంటి రంగారెడ్డి తప్పు పట్టారు. వామపక్షాలతో.. కాంగ్రెస్ పార్టీ సీట్ల సర్దుబాటుపై మెతక వైఖరి ప్రదర్శిసోందన్నారు. సదరు విషయమై.. హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్​లోని ఎంబీ భవన్​లో సీపీఎం రాష్ట్ర కార్యవర్గ ప్రత్యేక సమావేశం నిర్వహించారు. రాబోయే ఎన్నికల్లో సీపీఐ పార్టీతో మాట్లాడి.. కలిసి ఎన్నికల్లో పోటీకి సిద్ధం కావాలని నిర్ణయించుకున్నట్లు ఆయన వివరించారు.

తమ పార్టీ 10, 15 స్థానాలు ఎంపిక చేసుకొని అభ్యర్థులను బరిలోకి దింపాలని చివరిగా నిర్ణయం తీసుకున్నట్లు జూలకంటి రంగారెడ్డి తెలిపారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలన్న.. బీజీపీ, బీఆర్ఎస్ పార్టీలను ఓడించాలని ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్న అందరిని కలుపుకొని బీఆర్ఎస్​కు వ్యతిరేకంగా పోరాడేటట్లు కనిపించడం లేదని ఆయన పేర్కొన్నారు.

"తెలంగాణలో రాబోయే ఎన్నికలకు సీపీఐ సిద్ధమవుతోంది. ఒంటరిగా కాకుండా కాంగ్రెస్​ పార్టీతో కలిసి పోటీ చేయాలని నిర్ణయించుకున్నాము. సీట్ల సర్దుబాటుపై చర్చలు నడుస్తున్నాయి. త్వరలోనే పోటీ చేసే స్థానాలను ప్రకటిస్తాము". - డి. రాజా, సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి

కాంగ్రెస్‌తో పొత్తులపై చర్చలు ఇంకా కొనసాగుతున్నాయి

Chada Letter to CM KCR : సీఎం కేసీఆర్​కు చాడ లేఖ.. అలా చేయాలని డిమాండ్

CPI Narayana on Alliance with Congress in Telangana : 'కాంగ్రెస్​తో రాజకీయ అవగాహన కుదిరింది.. ఇంకా సీట్ల విషయమే కుదరలేదు'

Last Updated : Nov 1, 2023, 10:54 PM IST

ABOUT THE AUTHOR

...view details