హైదరాబాద్లో సిలిండర్లు చోరీ చేస్తోన్న సభావత్ రవిని పోలీసులు అరెస్టు చేశారు. చోరీ చేసిన సిలిండర్లను తన ఆటోలో తరలిస్తుండగా... గాయత్రీ నగర్ చౌరస్తా వద్ద పోలీసులు పట్టుకున్నారు.
సిలిండర్ల దొంగ దొరికాడు - Cylinders Theft Arrest
హైదరాబాద్లో తాళం వేసి ఉన్న ఇళ్లల్లో సిలిండర్లను దొంగలిస్తోన్న వ్యక్తిని మీర్ పేట పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ మేరకు నిందితుడి నుంచి రూ.1.90 లక్షల రూపాయలు విలువచేసే 30 సిలిండర్లను స్వాధీనం చేసుకున్నారు.
![సిలిండర్ల దొంగ దొరికాడు గ్యాస్ సిలిండర్ల దొంగ అరెస్ట్](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6053919-thumbnail-3x2-theif.jpg)
గ్యాస్ సిలిండర్ల దొంగ అరెస్ట్
వాహనాలు తనిఖీ చేస్తుండగా అనుమానాస్పద సమాధానం చెప్పడం వల్ల నిందితుడిని ఠాణాకు తీసుకొచ్చి విచారించారు. ఈ మేరకు గుఱ్ఱంగూడలో సిలిండర్లు తానే చోరీ చేశానని ఒప్పుకున్నాడు. నిందితుడి వద్దనున్న 1.9 లక్షల రూపాయల విలువైన 30 సిలిండర్లు, ఒక ఆటోను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం రిమాండ్కు తరలించామని పోలీసులు వెల్లడించారు.
గ్యాస్ సిలిండర్ల దొంగ అరెస్ట్
Last Updated : Feb 13, 2020, 12:23 PM IST
TAGGED:
Cylinders Theft Arrest