రానున్న రెండు, మూడేళ్లలో దశలవారీగా నగరంలో 450 కి.మీ. మేర సైకిల్ ట్రాక్‌లను అందుబాటులోకి తెచ్చేందుకు జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండీఏ, హైదరాబాద్ యూనిఫైడ్ మెట్రోపాలిటన్ ట్రాన్స్‌పోర్ట్ అథారిటీ(హెచ్‌ఎంటీఏ) కసరత్తు చేస్తున్నాయి. ఖైరతాబాద్, హైటెక్ సిటీ, కూకట్‌పల్లి, దిల్‌సుఖ్‌నగర్, చార్మినార్, మెహిదీపట్నం, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, హైదరాబాద్ నాలెడ్జ్ సెంటర్, కోకాపేట తదితర ప్రాంతాల్లో అభివృద్ధికి ప్రణాళికలు రూపొందిస్తున్నాయి.
కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ‘సైకిల్ ఫర్ ఛేంజ్’ ఛాలెంజ్‌కు దేశవ్యాప్తంగా 95 నగరాలు ఎంపికయ్యాయి. మన రాష్ట్రం నుంచి హైదరాబాద్, వరంగల్, కరీంనగర్‌కు చోటు దక్కింది. ఈ ఛాలెంజ్ రెండు దశల్లో అమలవుతోంది. మొదటి దశలో సైకిల్ ట్రాక్‌లను ఎక్కడెక్కడ అభివృద్ధి చేస్తే ప్రయోజనం చేకూరుతుందనే అంశంపై సర్వే చేపడతారు. రెండో దాంట్లో ప్రచారం, సైక్లింగ్ ట్రాక్‌లను అభివృద్ధి చేయాల్సి ఉంటుంది.