దేశ వ్యాప్తంగా మహమ్మారిపై పోరాటంలో ముందు వరుసలో ఉన్న కొవిడ్ వారియర్స్‌కు సైకిల్ అగరుబత్తి సంస్థ సిబ్బంది శానిటైజర్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర పశుసంవర్థక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కార్యాలయంలో సుమారు ఐదు వేల శానిటైజర్లను ఆ సంస్థ తెలంగాణ ఏరియా మేనేజర్ హైదరాబాద్ జిల్లా వైద్యాధికారికి అందజేశారు.
సామాజిక బాధ్యతలో సైకిల్ అగరుబత్తి సిబ్బంది - హైదరాబాద్ కరోనా వారియర్స్ వార్తలు
కరోనా సంక్షోభ సమయంలో ప్రతీ ఒక్కరు తప్పనిసరిగా శానిటైజర్ వాడాలని రాష్ట్ర పశుసంవర్థక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. సైకిల్ అగరుబత్తి తెలంగాణ మేనేజర్ ఆధ్వర్యంలో కరోనా వారియర్స్‌కు శానిటైజర్ పంపిణీ చేయడాన్ని ఆయన ప్రశంసించారు.
![సామాజిక బాధ్యతలో సైకిల్ అగరుబత్తి సిబ్బంది cycle agarbatti employees distribute sanitizers to corona warriors in hyderabad](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-10138385-1082-10138385-1609933825928.jpg)
సామాజిక బాధ్యతలో సైకిల్ అగరుబత్తి సిబ్బంది
కరోనా వారియర్స్‌కు తమ వంతు బాధ్యతగా శానిటైజర్లను పంపిణీ చేసిన సైకిల్ అగరుబత్తి సంస్థ సిబ్బందిని మంత్రి శ్రీనివాస్ యాదవ్ అభినందించారు.
ఇదీ చదవండి:ఫిబ్రవరి నెలలో బడ్జెట్ సమావేశాలు..!