Cyber fraud in the name of part time jobs : సైబర్ నేరాలను కట్టడి చేసేందుకు ఎన్ని కఠిన చట్టాలు తెచ్చినా.. వాటికి అడ్డుకట్ట మాత్రం పడటం లేదు. రోజూ ఏదో ఓ చోట ఈ మోసాలు వెలుగు చూస్తూనే ఉన్నాయి. నిరక్ష్యరాస్యులు, విద్యావంతులు, ఉద్యోగాల వేటలో ఉన్న యువత, ఉన్నత పదవుల్లో ఉన్న వారు.. ఇలా ప్రతి ఒక్కరూ ఈ కేటుగాళ్ల వలలో చిక్కుకుని విలవిల్లాడుతున్నారు. సర్వం కోల్పోయాక.. పోలీసులను ఆశ్రయిస్తున్నారు.
హైదరాబాద్‌లో ఇలాగే ఓ నలుగురు యువకులు పోలీసులను ఆశ్రయించారు. పార్ట్ టైమ్ ఉద్యోగాల పేరిట తమను నిండా ముంచేశారని సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ప్రైవేట్ ఉద్యోగాలు చేసుకునే తమతో.. పార్ట్ టైమ్ ఉద్యోగాల పేరిట పెట్టుబడులు పెట్టించి రూ.68 లక్షలు కాజేశారని వేరువేరుగా కంప్లైంట్ చేశారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..పార్ట్ టైమ్ జాబ్‌ల పేరిట సైబర్ కేటుగాళ్లు లింక్‌లు క్రియేట్ చేసి వాట్సాప్ గ్రూపుల్లో సందేశాలు పంపించినట్లు పోలీసులు వెల్లడించారు. ఆ లింక్‌పై క్లిక్ చేయగానే బాధితులు ఓ టెలీగ్రామ్ గ్రూప్‌తో అనుసంధానమైనట్లు తెలిపారు. వెంటనే ఫోన్‌లో అందుబాటులోకి వచ్చిన వ్యక్తి.. కొన్ని టాస్కులు ఇస్తామని, వాటిని పూర్తి చేస్తే డబ్బులొస్తాయని ఇద్దరికి.. తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు పొందవచ్చని మరో ఇద్దరు బాధితులకు చెప్పాడని వివరించారు. ఇలా మాయమాటలతో వారిని నమ్మించి.. టోలీచౌకి, బోరబండలకు చెందిన బాధితుల నుంచి రూ.25 లక్షల చొప్పున, యూసుఫ్‌గూడా, ఫిలింనగర్‌లకు చెందిన బాధితుల నుంచి చెరో రూ.9 లక్షల చొప్పున కాజేశారని స్పష్టం చేశారు.
జాకీ ఉత్పత్తుల పేరిట రూ.3.35 లక్షలు..: మరో కేసులో ఓ వ్యక్తి నుంచి రూ.3.35 లక్షలు కాజేసినట్లు సైబర్ క్రైమ్ పోలీసులు తెలిపారు. జాకీ ఉత్పత్తుల ఫ్రాంచైజీ కోసం ఆన్‌లైన్‌లో వెతకగా.. సైబర్ కేటుగాళ్లు కుచ్చుటోపీ పెట్టారని వెల్లడించారు. వివరాల్లోకి వెళితే.. రంగారెడ్డి జిల్లాకు చెందిన ఓ వ్యాపారి జాకీ ఉత్పత్తుల ఫ్రాంచైజీ కోసం ఆన్‌లైన్‌లో వెతకగా ఓ లింక్ కనిపించింది. దానిపై క్లిక్ చేసి దరఖాస్తు ఫారమ్‌లో వివరాలు నింపాడు.