సీన్ రీకన్‌స్ట్రక్షన్ కోసం రాలేదు, దిశ వస్తువుల సేకరణ కోసం వచ్చామని... ఘటనపై ఎలాంటి అవాస్తవాలు ప్రసారం చేయొద్దని సైబరాబాద్ సీపీ సజ్జనార్ తెలిపారు. నిందితులు ఇతర రాష్ట్రాల్లోనూ ఇదే తరహా నేరాలకు పాల్పడినట్లు అనుమానాలు ఉన్నాయని వెల్లడించారు. కర్ణాటక, ఏపీ, తెలంగాణలో ఇదే తరహాలో నేరాలు చేసినట్లు సమాచారం ఉందని ఆయన చెప్పారు. అనుమానిత, గుర్తుతెలియని మరణాలపై, మహిళల మృతదేహాల దహనం, ఇతర కేసుల్లో వీరి ప్రమేయంపై దర్యాప్తు చేస్తున్నామని సజ్జనార్ తెలిపారు. బాధితురాలి కుటుంబ వివరాలను గోప్యంగా ఉంచాలని కోరుతున్నామని... దానితోపాటు నిందితుల కుటుంబ సభ్యుల వివరాలు కూడా గోప్యంగా ఉంచాలని కోరారు.
'సీన్ రీకన్‌స్ట్రక్షన్ కోసం కాదు.. వస్తువుల సేకరణ కోసం వెళ్లాం' - దిశ అత్యాచారం
దిశ నిందితుల ఎన్కౌంటర్పై అవాస్తవాలు ప్రసారం చేయెద్దని సీపీ సజ్జనార్ విజ్ఞప్తి చేశారు. నిందితులకు ఇతర కేసుల్లో ప్రమేయం ఉందా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. బాధిత కుటుంబ సభ్యులతో పాటు నిందితుల కుటుంబ సభ్యుల వివరాలు గోప్యంగా ఉంచాలని కోరారు.
'సీన్ రీకన్‌స్ట్రక్షన్ కోసం కాదు.. దిశ వస్తువుల సేకరణ కోసం వచ్చాం'