యావత్ దేశాన్ని కదిలించిన దిశ అత్యాచారం, హత్య కేసులో మరో సీసీ దృశ్యం బయటకు వచ్చింది. గత నెల 27న రాత్రి సమయంలో నలుగురు నిందితులు పశువైద్యురాలు దిశపై అత్యాచారం చేసి.. పాశవికంగా హత్య చేసిన సంగతి తెలిసిందే. ఈ ఘటన అనంతరం నిందితులు చటాన్‌పల్లిలో ఘటన స్థలంలోనే పోలీసులు జరిపిన ఎన్‌కౌంటర్‌లో హతమయ్యారు.
దిశ కేసు: నిందితులు వాడిన లారీ దృశ్యాలు విడుదల
దిశ ఘటనలో నిందితులు వాడిన లారీ దృశ్యాలను పోలీసులు విడుదల చేశారు. ఈ కేసులో నలుగురు నిందితులను సైబరాబాద్ పోలీసులు ఎన్‌కౌంటర్ చేసిన సంగతి తెలిసిందే.
దిశ హత్యాచారం, నిందితుల ఎన్‌కౌంటర్ దేశవ్యాప్తంగా సంచలనం రేపిన నేపథ్యంలో ఈ ఘటనకు సంబంధించిన కీలక వీడియో తాజాగా వెలుగులోకి వచ్చింది. ఈ వీడియో ఆధారంగానే పోలీసులు దిశ కేసును ఛేదించి నిందితులను గుర్తించారు. నవంబర్ 27న రాత్రి 10.28 గంటల సమయంలో తోండుపల్లి జంక్షన్ నుంచి వెళ్తున్న లారీలో దిశ మృతదేహాన్ని నిందితులు తరలించారని పోలీసులు గుర్తించారు. టోల్‌గేట్ వద్ద ఉన్న సీసీటీవీ కెమెరాల్లో లారీ వెళ్తున్న దృశ్యాలు నమోదయ్యాయి.
ఇవీ చూడండి: ఉరి తాళ్ల తయారీకి ఆర్డర్- 'నిర్భయ' దోషుల కోసమేనా?