తెలంగాణ

telangana

ETV Bharat / state

Karvy Case: పార్థసారథిపై ప్రశ్నల వర్షం కురిపిస్తున్న సైబరాబాద్​ పోలీసులు!

కార్వీ స్టాక్ బ్రోకింగ్ లిమిటెడ్ కేసులో సైబరాబాద్​ పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. కార్వీ ఛైర్మన్ పార్థసారథిని ప్రశ్నిస్తున్న పోలీసులు.. మోసాలకు సంబంధించిన వివరాలు సేకరిస్తున్నారు. మరోవైపు సైబరాబాద్ పోలీసుల కస్టడీ ముగియగానే పంజాబ్ పోలీసులు పార్థసారథిని పీటీ వారెంట్​పై తీసుకెళ్లనున్నారు.

Karvy Case: దర్యాప్తు ముమ్మరం.. పార్థసారథిపై ప్రశ్నల వర్షం
Karvy Case: దర్యాప్తు ముమ్మరం.. పార్థసారథిపై ప్రశ్నల వర్షం

By

Published : Sep 9, 2021, 1:57 PM IST

కార్వీ ఛైర్మన్ పార్థసారథిని సైబరాబాద్ పోలీసులు ప్రశ్నిస్తున్నారు. ఐసీఐసీఐ బ్యాంకు నుంచి రూ.550 కోట్ల రుణం తీసుకున్న పార్థసారథి.. తిరిగి చెల్లించకపోవడంతో కేసు నమోదైంది. పెట్టుబడిదారుల షేర్లు తనఖా పెట్టి పార్థసారథి రుణం పొందారనే అభియోగాలు ఉన్నాయి.

బ్యాంకును ఏ విధంగా మోసం చేశారనే వివరాలపై పోలీసులు ప్రశ్నిస్తున్నారు. హైదరాబాద్ సీసీఎస్​లోనూ కార్వీ సంస్థపై పలు కేసులు నమోదయ్యాయి. ఇండస్ ఇండ్, హెచ్​డీఎఫ్​సీ బ్యాంకులను పార్థసారథి మోసం చేశారని అభియోగాలు ఉన్నాయి. ఇప్పటికే పార్థసారథిని సీసీఎస్ పోలీసులు మూడుసార్లు ప్రశ్నించారు. కార్వీకి చెందిన రాజీవ్​సింగ్​, కృష్ణహరి, శైలజను అరెస్టు చేశారు.

కార్వీ స్టాక్ బ్రోకింగ్ లిమిటెడ్​పై ఇతర రాష్ట్రాల్లోనూ కేసులు నమోదయ్యాయి. ఆయా కేసుల దర్యాప్తులో భాగంగా పంజాబ్ పోలీసులకు పీటీ వారెంటుకు నాంపల్లి కోర్టు అనుమతిచ్చింది. కస్టడీ తర్వాత పార్థసారథిని పంజాబ్ పోలీసులు తీసుకెళ్లనున్నారు. అక్కడ నమోదైన కేసుల ఆధారంగా ప్రశ్నించనున్నారు.

ABOUT THE AUTHOR

...view details