రహదారి ప్రమాదాల నివారణకు ట్రాఫిక్ పోలీసులు తీవ్రంగా కృషి చేస్తున్నారు. ఇందులో భాగంగా ఎప్పటికప్పుడు తనిఖీలు చేస్తూ.. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకుంటున్నారు. మద్యం సేవించి వాహనం నడిపే వాళ్లపై కేసులు నమోదు చేస్తున్న సైబరాబాద్ పోలీసులు.. ఇక నుంచి ఆ వాహనంలో కూర్చున్న వారి మీద కేసు పెట్టేందుకు సిద్ధమవుతున్నారు. ఇందుకోసం మోటారు వాహనాల చట్టం-1988లోని సెక్షన్ 188ని ప్రయోగిస్తున్నారు. డ్రైవర్ తాగి ఉన్నాడని తెలిసి ఏమాత్రం పట్టించుకోకుండా అదే వాహనంలో కూర్చొని ప్రయాణిస్తే చట్టరీత్యా నేరమని సైబరాబాద్ ట్రాఫిక్ డీసీపీ విజయ్ కుమార్ తెలిపారు.
డ్రైవర్ స్థితిగతులను తెలుసుకోవాలి..
మద్యం సేవించి వాహనం నడపడం వల్ల ప్రమాదాలు పెరుగుతున్నాయని ట్రాఫిక్ పోలీసుల అధ్యయనంలో తేలింది. మోతాదుకు మించి సేవించటం వల్ల డ్రైవర్ నియంత్రణ కోల్పోయే ప్రమాదం ఉంది. ఈ తరహా ప్రమాదాలు నివారించడానికి పోలీసులు నిత్యం తనిఖీలు నిర్వహిస్తున్నారు. వాహనాలు స్వాధీనం చేసుకొని... ఒకట్రెండు రోజుల తర్వాత డ్రైవర్లకు కౌన్సిలింగ్ ఇస్తున్నారు. మద్యం సేవించి వాహనం నడపడం వల్ల కలిగే అనర్థాలు, కుటుంబ యజమానికి ఏదైనా జరిగితే... వారుపడే యాతన వంటివి దృశ్య మాధ్యమం ద్వారా ట్రాఫిక్ చూపిస్తున్నారు. అనంతరం వాహనదారులపై నేరాభియోగపత్రాన్ని కోర్టులో దాఖలు చేస్తున్నారు. ఇక ప్రయాణికులపైనా కేసు నమోదు చేస్తామని ట్రాఫిక్ పోలీసులు హెచ్చరిస్తుండటంతో.. డ్రైవర్ స్థితిగతులను తెలుసుకొని వాహనంలో ప్రయాణించాల్సిన అవసరం ఏర్పడింది.
వాహనదారుల్లో మార్పు రాకపోవటం వల్లే..