తెలంగాణ

telangana

ETV Bharat / state

drunken Drive cases: సైబరాబాద్ పరిధిలో 372 మందికి జైలుశిక్ష

రాజధాని నగరంలోని సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో మద్యం సేవించి వాహనాలు నడిపిన వారిపై పోలీసులు కేసులు నమోదు చేస్తున్నారు. గతనెలలో కేసులు నమోదైన 621 మందిని కోర్టులో హాజరుపర్చగా 249 మందికి జరిమానా విధించింది. మద్యం సేవించి రెండోసారి దొరికిన 372 మందికి జైలుశిక్ష ఖరారు చేసింది.

drunken Drive cases
సైబరాబాద్ కమిషనరేట్

By

Published : Aug 3, 2021, 5:09 AM IST

Updated : Aug 3, 2021, 6:18 AM IST

నగరంలో మద్యం సేవించి వాహనాలు నడిపిన వాళ్లకు కూకట్‌పల్లి న్యాయస్థానం జైలుశిక్ష విధించింది. సోమవారం సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో 621 మంది మందుబాబులను ట్రాఫిక్‌ పోలీసులు న్యాయస్థానంలో ప్రవేశపెట్టారు. ఇందులో 372 మంది వాహనదారులకు 1 నుంచి 28 రోజుల వరకు జైలు శిక్ష విధించగా, 238 మందికి రూ.15.26లక్షల జరిమానా విధించింది.

లైసెన్స్ రద్దు చేయాలని ఆర్టీవోలకు సూచన

ఇక లైసెన్స్‌ లేకుండా వాహనం నడిపిన 238 మందికి రూ.6.71లక్షల జరిమానా వేశారు. గత నెల 26 నుంచి 30వ తేదీ వరకు నిర్వహించిన తనిఖీల్లో 621 మంది వాహనదారులు పట్టుబడ్డారు. మరోవైపు మద్యం సేవించి వాహనాలు నడిపిన వాళ్ల వివరాలను ట్రాఫిక్‌ పోలీసులు రవాణాశాఖకు పంపారు. మోటారు వాహనాల చట్టం ప్రకారం డ్రైవింగ్ లైసెన్సు రద్దు చేయాలని ఆర్టీవోలకు సూచించారు.


ఇదీ చూడండి:పట్టుబడిన వారిలో ద్విచక్రవాహనదారులే అధికం

Last Updated : Aug 3, 2021, 6:18 AM IST

ABOUT THE AUTHOR

...view details