తెలంగాణ

telangana

ETV Bharat / state

అవినీతి ఆరోపణలతో సైబరాబాద్‌లో సీఐపై వేటు.. - అవినీతి ఆరోపణలు వాస్తవం

సైబరాబాద్‌ పోలీస్ కమిషనరేట్‌లో పనిచేస్తున్న ఓ సీఐపై వేటు పడింది. అవినీతి ఆరోపణలు వాస్తవమని తేలడం వల్ల సదరు పోలీస్ అధికారిని విధుల నుంచి తొలగించారు.

అవినీతి ఆరోపణలతో సైబరాబాద్‌లో సీఐపై వేటు..

By

Published : Sep 28, 2019, 8:06 PM IST

హైదరాబాద్​లోని సైబరాబాద్‌ పోలీస్ కమిషనరేట్‌లో పనిచేస్తున్న సీఐ రామకృష్ణపై వేటు పడింది. శంషాబాద్‌ ఆర్జీఐ ఠాణాలో ఇన్‌స్పెక్టర్‌గా విధులు నిర్వహిస్తూ అవినీతి ఆరోపణలు రావడం వల్ల సైబరాబాద్‌ పోలీస్ కమిషనరేట్‌కు అటాచ్‌ చేశారు. ఇటీవల అమోనియం నైట్రేట్‌ పేలుడు ఘటనలో నిందితుల నుంచి రామకృష్ణ రూ.3 లక్షల లంచం తీసుకున్నట్టు వచ్చిన ఆరోపణలు వాస్తవమని సైబరాబాద్‌ పోలీస్​ కమిషనర్ సజ్జనార్‌ తేల్చడంతో సీఐ రామకృష్ణను విధుల నుంచి తొలగించారు.

అవినీతి ఆరోపణలతో సైబరాబాద్‌లో సీఐపై వేటు..

ABOUT THE AUTHOR

...view details