సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో వార్షిక నేర నివేదికను సీపీ స్టీఫెన్ రవీంద్ర విడుదల చేశారు. ఈ సంవత్సరం 27,322 ఎఫ్ఐఆర్లు నమోదు చేశామని తెలిపారు. 79 మందిపై పీడీ యాక్ట్లు పెట్టామని చెప్పారు. 57,175 డ్రంకన్ డ్రైవింగ్ కేసులు.. 13 మందిపై రౌడీషీట్లు తెరిచామని పేర్కొన్నారు. 849 మందిపై సస్పెక్ట్ షీట్స్ ఓపెన్ చేశామని వివరించారు. గతేడాదితో పోలిస్తే రోడ్డు ప్రమాదాల కేసులు 19.8 శాతం తగ్గాయని వెల్లడించారు.
అపహరణ కేసులు 2021లో 244 కేసులు ఉండగా.. 2022లో 232 కేసులు నమోదు చేశామని సీపీ స్టీఫెన్ రవీంద్ర తెలిపారు. మహిళా హత్యలు, స్థిరాస్తి నేరాల హత్యలు ఈ సంవత్సరం తగ్గాయని పేర్కొన్నారు. దోపిడీ కేసులు 99 శాతం తగ్గాయని.. స్నాచింగ్ కేసులు 4 శాతం తగ్గాయని చెప్పారు. రాత్రి దొంగతనాల కేసులు గతేడాదితో పోలిస్తే ఈ సంవత్సరం 33 శాతం తగ్గాయని స్టీఫెన్ రవీంద్ర వివరించారు.