సైబరాబాద్ పోలీసు కమిషనర్ సజ్జనార్ కరోనా టీకా వేయించుకున్నారు. కొవిడ్ సమయంలో ధైర్యంగా ముందు వరుసలో నిలబడి ప్రజలకు సేవలందించిన పోలీసు సిబ్బందిని ఆయన ప్రశంసించారు. వ్యాక్సిన్‌పై అనుమానాలు వీడాలని సూచించారు. రాబోయే మూడు రోజుల్లో సైబరాబాద్ పరిధిలో 7 వేల మంది పోలీసు అధికారులు, సిబ్బంది వ్యాక్సిన్ తీసుకోనున్నారని సీపీ తెలిపారు.
కొవిడ్ వ్యాక్సిన్‌పై అనుమానాలు వీడండి: సీపీ సజ్జనార్ - Hyderabad latest news
కొవిడ్ వ్యాక్సిన్‌పై అనుమానాలు వీడాలని సైబరాబాద్ పోలీసు కమిషనర్ సజ్జనార్ సూచించారు. కరోనా సమయంలో ధైర్యంగా ముందు వరుసలో నిలబడి ప్రజలకు సేవలందించిన పోలీసు సిబ్బందిని ఆయన ప్రశంసించారు. ఆయన ఇవాళ టీకా వేయించుకున్నారు.
sajjanar
భారత్ బయోటెక్, సీరమ్ ఇన్‌స్టిట్యూట్ శాస్త్రవేత్తలు, సిబ్బంది తక్కువలోనే వ్యాక్సిన్‌ను అందుబాటులోకి తెచ్చారని అన్నారు. ఇదంతా వారి కృషికి నిదర్శమని ఆయా సంస్థల యాజమాన్యాలను సజ్జనార్ అభినందించారు. ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ తీసుకోవడానికి ముందుకు రావాలని సీపీ కోరారు.
ఇదీ చదవండి: రైతు వేదికలు, పల్లె ప్రగతిని దేశ వ్యాప్తంగా అమలు చేయాలి: నామ