ఓ జాతీయ బ్యాంకు మేనేజరును మోసం చేసిన కేసులో నిందితులను సైబరాబాద్ క్రైం పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి ఓ కారు, రూ.3 లక్షల నగదు, ఏడు ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఉత్తరప్రదేశ్ ఘజియాబాద్‌కు చెందిన అరుణ్‌కుమార్, లోకేశ్ తోమర్, మోహిత్‌కుమార్, మనోజ్ కుమార్‌లు సామాజిక మాధ్యమాల ద్వారా కార్ల షోరూమ్‌లు, యజమానుల వివరాలు తెలుసుకుంటారు. తమకు కార్ల షోరూమ్‌లు ఉన్నాయని... వాటి ద్వారా వచ్చే లాభాలను బ్యాంకులో డిపాజిట్ చేస్తామంటూ జాతీయ బ్యాంకుకు చెందిన మేనేజరును నమ్మించారు. అయితే ఇందుకు రూ.8 లక్షల రూపాయలు తాము సూచించిన ఖాతాలో డిపాజిట్ చేయాలని అన్నారు. కేటుగాళ్ల మాటలు నమ్మిన మేనేజర్.. డబ్బులు ఖాతాలో జమ చేశారు. అనంతరం వారి నుంచి ఎలాంటి స్పందన రాకపోయేసరికి మోసపోయానని గ్రహించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు విచారణ చేపట్టి నిందితులను అదుపులోకి తీసుకున్నారు. సైబర్ మోసాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సైబరాబాద్ సీపీ సజ్జనార్ సూచించారు.
బ్యాంకు మేనేజరును మోసం చేసిన కేటుగాళ్ల అరెస్టు - సైబరాబాద్ పోలీసులు
ఓ కార్ల షోరూం యజమానులమని.. తమ సంస్థ లాభాలను బ్యాంకులో డిపాజిట్ చేస్తామంటూ ఓ జాతీయ బ్యాంకు మేనేజరును నమ్మించారు. ఇందుకు ముందుగా తమ ఖాతాలో 8 లక్షలు డిపాజిట్ చేయాలంటూ చెప్పారు. వారి మాటలు నమ్మి డబ్బు జమ చేసిన మేనేజర్... అనంతరం మోసమని గ్రహించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. విచారణ జరిపిన సైబరాబాద్ పోలీసులు నిందితులను కటాకటాల్లోకి నెట్టారు.
సైబర్ నేరగాళ్ల అరెస్టు