తెలంగాణ

telangana

ETV Bharat / state

ఇళ్లు ఇప్పిస్తామని మోసం.. రూ.2 కోట్లకు పైగా వసూల్​ - hyderabad crime news

డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు ఇప్పిస్తామని అమాయక ప్రజలను మోసం చేస్తూ డబ్బులు దండుకుంటున్న ఆరుగురు సభ్యుల ముఠాను సైబరాబాద్​ పోలీసులు అరెస్ట్​ చేశారు. నిందితుల నుంచి కోటి 12 లక్షల రూపాయలు స్వాధీనం చేసుకున్నారు.

cyberabad police arrested double bed room Cheaters  in hyderabad
ఇళ్లు ఇప్పిస్తామని మోసం.. రూ.2 కోట్లకు పైగా వసూల్​

By

Published : Feb 8, 2020, 7:38 PM IST

మోసపోయే వారుంటే మోసం చేసే వారు పెరుగుతూనే ఉంటారు. తాజాగా డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు ఇప్పిస్తామని అమాయక ప్రజల నుంచి డబ్బులు వసూలు చేసిన ముఠాను సైబారాబాద్​ పోలీసులు పట్టుకున్నారు.

ఏపీలోని పశ్చిమ గోదావరికి చెందిన వెంకట్..​ కృష్ణమూర్తి, కె.శ్రీనివాస్​, పి.శ్రీనివాస్​, లక్ష్మి, కృష్ణా రావులతో కలిసి ముఠాగా ఏర్పడి డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు ఇప్పిస్తామని 169 మంది వద్ద రూ.2 కోట్ల 45 లక్షలు కొల్లగొట్టారని సీపీ సజ్జనార్ తెలిపారు.

నిందితుల నుంచి కోటి 12 లక్షల రూపాయల నగదు, కిలో బంగారం, ఒక కారు, 6 చరవాణిలు, లాప్​టాప్, ప్రింటర్ స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు.

ఇళ్లు ఇప్పిస్తామని మోసం.. రూ.2 కోట్లకు పైగా వసూల్​

ఇవీ చూడండి:ముగింపు నేడే: సాయంత్రం అమ్మవార్ల వనప్రవేశం

ABOUT THE AUTHOR

...view details