Fake Certificates Gang Arrest: విశాఖకు చెందిన షేతక్‌ఖాజా నాలుగునెలల క్రితం నుంచి హైదరాబాద్ మియాపూర్‌లో ఉంటున్నాడు. డిగ్రీ పట్టాకోసం స్నేహితుడు ప్రేమ్‌కుమార్‌ను సంప్రదించాడు. సికింద్రాబాద్‌కు చెందిన సత్యనారాయణ శర్మ కన్సల్టెన్సీ నిర్వహిస్తున్నాడని అతను డిగ్రీ పట్టా సమకూరుస్తాడని తెలపగా... షేక్‌ఖాజా బీఎస్సీ కోర్సుకు దూరవిద్యా విధానంతో పట్టాకావాలని కోరాడు. మేఘాలయలోని మహాత్మాగాంధీ యూనివర్సిటీ మాజీ కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్‌గా పనిచేసిన అఖిలేష్, ప్రవీణ్ తెలుసని చెప్పాడు.
వారి సహకారంతో కోర్సుకు ఆన్‌లైన్ విధానంలో పరీక్ష నిర్వహించాడు. తగిన ధ్రువపత్రాలు తీసుకున్నాడు. డిగ్రీ పట్టా కోసం 2 లక్షల 10వేల రూపాయలు కట్టాలని చెప్పాడు. నగదు బదిలీ చేసిన కొన్ని రోజుల తర్వాత ఎంజీ యూవర్సిటీ పేరిట 2016లో డిగ్రీ పూర్తి చేసినట్లుగా ప్రేమ్‌కుమార్‌కు వాట్సాప్‌లో సర్టిఫికేట్లు పంపారు. వాటిని తనిఖీ చేయగా నకిలీవని తేలడంతో మియాపూర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.