Fake Currency Gang Arrest in Hyderabad : ఐడీబీఐ, ఆదర్శ్ బ్యాంకులకు చెందిన నగదును జమ చేసేందుకు సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో రెండు చెస్ట్ బ్యాంకులు ఉన్నాయి. ఏటా అక్కడకి వచ్చే నకిలీ నోట్లపై పోలీసులకు.. అధికారులు ఫిర్యాదు చేస్తారు. ఈ క్రమంలో రెండు నెలల క్రితం కొన్ని నకిలీ నోట్లపై ఫిర్యాదు చేయడంతో ఏసీపీ శ్యాంబాబు ప్రత్యేక టాస్క్‌ఫోర్స్ బృందాలను రంగంలోకి దింపారు.
బ్యాంకులకు నకిలీ నోట్లు ఇచ్చిన ఖాతాదారుల వివరాలు సేకరించారు. రెండుసార్లకి పైగా నకిలీనోట్లు డిపాజిట్ చేసిన వారిని గుర్తించి విచారించారు. వారు ఇచ్చిన సమాచారంతో నకిలీ నోట్లు చేతులు మారిన వివరాలు సేకరించారు. అనుమాతులపై నిఘా పెట్టగా కొనేటి రాజేశ్, నీల్‌దాస్‌ను రాయదుర్గంలో అరెస్ట్ చేశారు. ఇంటి యజమానికి నకిలీ నోట్లను అద్దెగా ఇచ్చినట్లు గుర్తించారు. అతను పోలీసులకు సమాచారం ఇవ్వగా ఆసలు కథ వెలుగులోకి వచ్చింది. ఆ ఇద్దరు ఇచ్చిన సమాచారం మేరకు చెన్నై, బెంగళూరు, అనంతపూర్, కాకినాడ, గుంటూరు, ప్రకాశం, వరంగల్, మెదక్, కరీంనగర్, సంగారెడ్డికి ప్రత్యేక బృందాలను పంపారు.
fake currency notes making: మరో 11 మంది నిందితులను పట్టుకున్నారు. చెన్నైకి చెందిన కీలక నిందితుడు సూరియా సహా మరో ఇద్దరు పరారీ ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఒడిశాకి చెందిన కొనేటి రాజేశ్ బతుకు తెరువు కోసం హైదరాబాద్‌లోని వనస్థలిపురంలో ఉంటూనే డ్యాన్స్‌మార్టర్‌గా పనిచేస్తున్నాడు. గతంలో నేర చరిత్ర ఉన్న రాజేశ్ సులభంగా డబ్బు సంపాదించాలని భావించి నకిలీ కరెన్సీ నోట్లు ఉన్నాయని సామాజిక మాధ్యమాల్లో పెట్టాడు. అది గమనించిన కొన్ని ముఠాలు అతడిని సంప్రదించాయి. ఆ సమయంలో రాజేశ్‌కి నీల్‌దాస్ పరిచయమయ్యాడు.
సామాజిక మాధ్యమంలోని ఫోన్‌నంబర్ అధారంగా చెన్నైకి చెందిన నకిలీ నోట్ల చలామణి సూత్రధారి సూరియా, ఆంధ్రప్రదేశ్‌కి చెందిన రమేశ్, చరణ్ సింగ్ ముఠాతో పరిచయాలు ఏర్పడ్డాయి. తమ వద్ద నకిలీ నోట్లు ఉన్నాయని వాటిని చలామణీ చేస్తే రూ.5 లక్షలకు ఒక లక్ష రూపాయాలు ఇవ్వాలని ఒప్పదం కుదుర్చుకున్నారు. వాటి చెలామణికి కర్ణాటక, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, తెలంగాణలో ఇతర ముఠాలతో ఒప్పందం చేసుకున్నారు. ఇటీవల 60లక్షల నకీల నోట్లు చెన్నైకి చెందిన సూర్య ద్వారా అందగా.. వాటిలో ఒప్పందం చేసుకున్న ముఠాలకు రాజేష్, నీల్‌దాస్ పంపారు.