Cyberabad CP precautions to Passengers: సంక్రాంతి పండుగ నేపథ్యంలో భాగ్యనగరంలో బస్టాండ్లు, రైల్వే స్టేషన్లలో రద్దీ ఏర్పడింది. ఎంజీబీఎస్, జేబీఎస్, ఉప్పల్, ఎల్పీనగర్, బీహెచ్ఈఎల్, కూకట్పల్లి ప్రాంతాల్లో ప్రయాణికులు కిటకిటలాడుతున్నారు. సొంతూళ్లకు వెళ్లేందుకు ప్రయాణికులు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌కు భారీగా చేరుకుంటున్నారు. ఈ క్రమంలో ఇళ్లకు తాళాలు వేసి సొంత ఊళ్లకు పయనమవుతున్న వారికి సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర పలు సూచనలు జారీ చేశారు. ఇలాంటి సమయాల్లో దొంగతనాలకు ఆస్కారం ఉందన్న సీపీ.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈ మేరకు వారికి పలు జాగ్రత్తలు, సూచనలు చెప్పారు.
Cyberabad CP: 'సంక్రాంతికి ఊరెళ్తున్నారా.. అయితే ఈ జాగ్రత్తలు తప్పనిసరి' - Cyberabad CP precautions to Passengers
Cyberabad CP precautions to Passengers: హైదరాబాద్‌లో సంక్రాంతి పండుగ సందడి మొదలైంది. సొంతూళ్లకు వెళ్లే వారితో బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు కిటకిటలాడుతున్నాయి. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌కు ప్రయాణికుల తాకిడి పెరిగింది. రద్దీని దృష్టిలో ఉంచుకుని అధికారులు తగు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రత్యేక రైళ్లు ఏర్పాటు చేసినట్లు ఇప్పటికే రైల్వేశాఖ ప్రకటించింది. కరోనా నిబంధనలు పాటించేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. మాస్కులు లేకుండా వస్తున్న ప్రయాణికులకు రైల్వే ఆర్పీఎఫ్ పోలీసులు జరిమానా విధిస్తున్నారు.
సైబరాబాద్ సీపీ, సంక్రాంతి పండుగ జాగ్రత్తలు
సంక్రాంతికి సొంతూళ్లకు వెళ్లేవారికి సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర సూచనలు
ఇదీ చదవండి:ఊరెళ్తున్న భాగ్యనగరం.. హైదరాబాద్-విజయవాడ హైవేపై రద్దీ