తెలంగాణ రాష్ట్రంలోకి ఇతర ప్రాంతాల నుంచి ఒంటెల రవాణా, వాటిని కబేళాల్లో వధించడం వంటివి చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని సైబరాబాద్ సీపీ సజ్జనార్ హెచ్చరించారు. అంతే కాదు వాటి మాంసం విక్రయం కూడా నేరమని తెలిపారు. ఇప్పటికే కమిషనరేట్ పరిధిలో ఈ అక్రమార్కులపై ప్రత్యే నిఘా పెట్టామన్నారు.
ఒంటెల అక్రమ రవాణా, మాంసం విక్రయించడం నేరం: సైబరాబాద్ సీపీ - ఒంటెల అక్రమ రవాణా
ఒంటెల అక్రమ రవాణా, మాంసం విక్రయించడం శిక్షార్హమని సైబరాబాద్ సీపీ సజ్జనార్ అన్నారు. ఇలాంటి చర్యలకు పాల్పడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ఒంటెల అక్రమ రవాణా, మాంసం విక్రయించడం నేరం: సైబరాబాద్ సీపీ
ప్రజలు కూడా ఒంటెల కోసం ఆర్డర్లు ఇచ్చి తెప్పించుకున్నా జంతువుల వధ చట్టం క్రింద కేసులు నమోదు చేస్తామన్నారు. ఐదు సంవత్సరాల జైలు శిక్ష కూడా పడుతుందని తెలిపారు. ఎక్కడైనా ఇలాంటి కార్యకలాపాలు జరిగినా డయల్ 100 సమాచారం ఇవ్వాలని ప్రజలను కోరారు.
ఇవీ చూడండి: బాలల హక్కుల సంఘం అధ్యక్షుడు అచ్యుతరావు కన్నుమూత