తెలంగాణ

telangana

ETV Bharat / state

నకిలీ విత్తనాలు విక్రయిస్తే కఠిన చర్యలు: సీపీ సజ్జనార్​ - తెలంగాణ వార్తలు

నకిలీ విత్తనాలు విక్రయించే వాళ్లపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని సైబరాబాద్ సీపీ సజ్జనార్ హెచ్చరించారు. వ్యవసాయశాఖాధికారులు, విత్తన కంపెనీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు.

నకిలీ విత్తనాలు విక్రయిస్తే కఠిన చర్యలు: సీపీ సజ్జనార్​
నకిలీ విత్తనాలు విక్రయిస్తే కఠిన చర్యలు: సీపీ సజ్జనార్​

By

Published : Jun 9, 2021, 8:10 AM IST

సైబరాబాద్​ పోలీసు కమిషనర్​ సజ్జనార్​ కమిషనరేట్​ పరిధిలోని వ్యవసాయ శాఖ అధికారులు, విత్తన కంపెనీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. నకిలీ విత్తనాలను అరికట్టేందుకు విత్తన కంపెనీల ప్రతినిధులు సహకరించాలని కోరారు. నకిలీ విత్తనాలు విక్రయించే వ్యాపారుల సమాచారం పోలీసులకు అందించాలని డీలర్లకు సజ్జనార్ సూచించారు.

విత్తన కంపెనీలు నాణ్యత గల విత్తనాలనే విక్రయించాలని... ఎక్కడైనా నిబంధనలు ఉల్లంఘించినట్లు బయటపడితే చర్యలు తీసుకుంటామని సజ్జనార్ తెలిపారు. నకిలీ విత్తనాలు విక్రయించే వాళ్లపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

ఇదీ చదవండి:PRC: పీఆర్సీకి మంత్రివర్గం ఆమోదం.. ఈ నెల నుంచే పెరిగిన జీతాలు!

ABOUT THE AUTHOR

...view details