లాక్ డౌన్ అమలులో భాగంగా రోడ్డుపైకి వచ్చే వాహనాలను పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకుంటున్నారు. ఎర్రగడ్డ పరిసర ప్రాంతాల్లో రహదారిపైకి వచ్చిన వాహదారులను సైబరాబాద్ సీపీ సజ్జనార్ ఆపి... లాక్ డౌన్ ఉద్దేశాన్ని వివరించారు. అత్యవరమైన వారు మినహా ఇతరులను తిరిగి వెనక్కి పంపుతున్నారు.
అనవసరంగా రోడ్డుపైకి వస్తే చర్యలు తప్పవు - coronavirus updates
కరోనా కట్టడిలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం విధించిన లాక్డౌన్ను ప్రజలు ఉల్లంఘిస్తున్నారు. హైదరాబాద్లో వాహనదారులు యథేచ్ఛగా తిరుగుతున్నారు. ఎర్రగడ్డలో రహదారిపైకి వచ్చిన వాహనదారులను సైబరాబాద్ సీపీ సజ్జనార్ ఆపి.. లాక్ డౌన్ ఉద్దేశాన్ని వివరించారు.

cyberabad-cp-sajjanar
నగరంలోని పలు కూడాళ్లలోనూ పోలీసులు ఇదే పద్ధతి పాటిస్తున్నారు. ఎక్కడికక్కడ బారికేడ్లు ఏర్పాటు చేసి వాహనదారుల వివరాలను సేకరిస్తున్నారు. అనవసరంగా రోడ్డుపైకి వచ్చిన వారిని వెనక్కి పంపుతున్నారు. ద్విచక్ర వాహనంపై ఒకరు, కార్లలో అయితే ఒకరు లేక ఇద్దరే రావాలని స్పష్టం చేస్తున్నారు.
అనవసరంగా రోడ్డుపైకి వస్తే చర్యలు తప్పవు
ఇదీ చూడండి:లాక్‌డౌన్: అత్యవసరమైతేనే రండి లేదంటే కేసులు