తెలంగాణ

telangana

ETV Bharat / state

యువ వైద్యురాలి హత్యకేసులో నలుగురు అరెస్ట్ - shadnagar incident

దేశవ్యాప్తంగా సంచలనం రేపిన శంషాబాద్ హత్యోదంతం కేసును పోలీసులు ఛేదించారు. 10ప్రత్యేక బృందాలతో దర్యాప్తు చేపట్టిన సైబరాబాద్ పోలీసులు.... నలుగురిని అరెస్టు చేశారు. లారీలో పనిచేసే నలుగురే ఈ పాశవిక దాడికి తెగబడినట్లు సైబరాబాద్ సీపీ సజ్జనార్ నిర్ధారించారు. కేసు విచారణను వేగవంతం చేసి కఠిన శిక్షలు పడేలా చూసేందుకు ఫాస్ట్​ ట్రాక్ కోర్టుకు విచారణ కోసం విజ్ఞప్తి చేస్తామని వెల్లడించారు.

cyberabad-cp-sajjanar-spoke-on-shamshabad-murder-case
యువ వైద్యురాలి హత్యకేసులో నలుగురు అరెస్ట్

By

Published : Nov 29, 2019, 9:00 PM IST

Updated : Nov 29, 2019, 11:32 PM IST

యువ వైద్యురాలి హత్యకేసులో నలుగురు అరెస్ట్

హైదరాబాద్ శివారు శంషాబాద్ దారుణ హత్యను సవాల్ గా తీసుకున్న నిందితులను అరెస్టు చేశారు. మృతదేహం తమ కుమార్తెదే అని చెప్పడంతో దర్యాప్తు వేగవంతం చేసినట్లు సైబరాబాద్ సీపీ సజ్జనార్ వెల్లడించారు. 10 బృందాలతో.... సీసీ కెమెరా దృశ్యాల సాయంతో 48 గంటల్లోనే కేసును ఛేదించామని వివరించారు. కేసులో నలుగురిని అరెస్టు చేసిన పోలీసులు.... నారాయణ పేట జిల్లాలోని మక్తల్ మండలానికి చెందిన వారిగా గుర్తించారు.

సాయం చేస్తామని నటించి...

నిందితులు తరచుగా తెలంగాణ నుంచి మెటీరియల్ తరలిస్తుంటారని.... ఆరోజు జరగాల్సిన అన్ లోడ్ అవ్వకపోవడంతో నిందితులు అక్కడ బస చేశారని CP వివరించారు. సాయంత్రం 6 గంటల సమయంలో బాధితురాలిని గమనించిన నిందితులు... అప్పటి నుంచే యువతిపై అఘాయిత్యానికి కుట్రపన్నినట్లు తెలిపారు. సాయం చేస్తున్నట్లు నటించేందుకే నిందితులు ముందే ఆమె వాహనంలో గాలి తీసేసారు. అనంతరం అత్యంత పాశవికంగా అత్యాచారం చేసి.. ముక్కు, నోరు మూసేయడంతో ఆమె ఊపిరి ఆడక చనిపోయినట్లు సీపీ తెలిపారు.

ఫాస్ట్​ ట్రాక్​ కోర్టుకు విజ్ఞప్తి చేస్తాం...

ఈ కేసు విచారణ వేగవంతం చేసిన కఠిన శిక్షలు పడేలా చూసేందుకు ఫాస్ట్​ ట్రాక్​కువిచారణ కోసం విజ్ఞప్తి చేస్తామని సైబరాబాద్ సీపీ సజ్జనార్ వెల్లడించారు. ఎవరికి ఎలాంటి సమస్య వచ్చినా డయల్ 100కు ఫోన్ చేయాలని సైబరాబాద్ కమిషనర్ సజ్జనార్ కోరారు. మహిళలు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు షీ-టీమ్ కు ఫోన్ చేయాలని విజ్ఞప్తి చేశారు.

ఇవీ చూడండి: షాద్​నగర్​ ఘటన కేసులో నలుగురి అరెస్టు, పరారీలో ఒకరు

Last Updated : Nov 29, 2019, 11:32 PM IST

ABOUT THE AUTHOR

...view details