తమ బంధువులను చూసేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన క్వారంటైన్ కేంద్రాలకు ప్రజలెవరూ రావద్దని సైబరాబాద్ సీపీ, రంగారెడ్డి జిల్లా కలెక్టర్ అమయ్కుమార్లు సూచించారు. వివిధ కారణాలు చూపించి వారిని కలవడానికి వస్తే... వారి కుటుంబంతో పాటు మొత్తం సమాజం ప్రమాదంలో పడుతుందని వివరించారు. ఈ సూచనలు అతిక్రమిస్తే చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని సజ్జనార్ హెచ్చరించారు.
'క్వారంటైన్ సెంటర్లను సందర్శించేందుకు ప్రజలు రావద్దు' - corona virus today news
ప్రజలకు సైబరాబాద్ సీపీ సజ్జనార్, రంగారెడ్డి కలెక్టర్ అమయ్‌కుమార్ సూచనలిచ్చారు. క్వారంటైన్ సెంటర్లను సందర్శించేందుకు ప్రజలు రావద్దని పేర్కొన్నారు. సూచనలు అతిక్రమిస్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

'క్వారంటైన్ సెంటర్లను సందర్శించేందుకు ప్రజలు రావద్దు'
క్వారంటైన్ సెంటర్లలో ఉన్నవారికి అన్ని సౌకర్యాలు ప్రభుత్వం కల్పించిందని... ఎలాంటి అనుమానాలు ఉన్నా.. 104 హెల్ప్‌లైన్ నంబర్‌ను సంప్రదించాలని సూచించారు. వదంతులు ప్రచారం చేస్తే కఠనచర్యలు తీసుకుంటామని వెల్లడించారు.